UP: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన యోగి సర్కార్.. ఆస్తుల వివరాలు వెల్లడిస్తేనే జీతాలు!
- తమ ఆస్తుల వివరాలు నమోదు చేయాలని యూపీ గవర్నమెంట్ ఆదేశం
- పాటించని 2.44లక్షలకు పైగా ఉద్యోగులు
- వారి నెల జీతం ఆపేసిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ ఉత్తర్వులు, రిమైండర్‌లు ఉన్నప్పటికీ మానవ్ సంపద పోర్టల్‌లో తమ ఆస్తుల వివరాలను ఇవ్వని యూపీలోని 2 లక్షల 44 వేల 565 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. వీరికి ఆగస్టు నెల జీతం నిలిచిపోయింది. కొత్త ఆర్డర్ ప్రకారం, ఉద్యోగులు ఆగస్టు 31 లోగా మానవ సంపద పోర్టల్‌లో తమ చర, స్థిరాస్తుల వివరాలను అప్‌లోడ్ చేయాలి. శాఖల నివేదికల ఆధారంగా.. 2,44,565 మంది ఉద్యోగులు చివరి తేదీ దాటినా ఉత్తర్వులను పాటించలేదు. దీని కారణంగా వారి జీతాలు నిలిచిపోయాయి.
READ MORE: Bone Health: బలమైన ఎముకలను పొందాలంటే ఇలా చేయక తప్పదు..
Also Read
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
యూపీలోని ప్రభుత్వ విభాగాల్లో 8 లక్షల 46 వేల 640 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఐఏఎస్, పీసీఎస్ తరహాలో తమ ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆగస్టు 31లోగా అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ ముందుగానే.. అన్ని శాఖలకు లేఖ రాశారు. వివరాలు ఇవ్వకుంటే జీతం నిలిపివేస్తామని ఆదేశాలు ఇచ్చారు. ఇందులో ఉపాధ్యాయులతో పాటు కార్పొరేషన్లు, అటానమస్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను చేర్చలేదు. చీఫ్ సెక్రటరీ ఆదేశాల తర్వాత కూడా ఆస్తుల వివరాలు ఇవ్వడంలో ఉద్యోగులు విముఖత చూపుతున్నారు. కేవలం 6.02 లక్షల మంది ఉద్యోగులు మాత్రమే తమ ఆస్తులను వెల్లడించారు. సమాచారం ఇవ్వని ఉద్యోగులపై ఇప్పటికీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!