హౌసింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీని నెరవేరుస్తూ గృహ నిర్మాణ శాఖ రివ్యూలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కొత్త లబ్దిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను 23 జూలై 2024న సమర్పించనున్నారు. ఈసారి బడ్జెట్ లో ప్రభుత్వ దృష్టి మధ్యతరగతి, పేదలపైనే ఉండొచ్చు.
కర్నాటకలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదయ్యాయి. గత 15 నెలల వ్యవధిలో 1,182 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ తెలిపింది. ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు తీవ్రమైన కరువు, పంట నష్టం మరియు విపరీతమైన అప్పులు అని రెవెన్యూ శాఖ పేర్కొంది.
AP Deputy CM Pawan Kalyan Chamber: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించే రోజు ఖరారైంది. జూన్ 19వ తేదీ బుధవారం రోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ కళ్యాణ్‌కు కేటాయించారు. దీనిపై ఇప్పటికే సంతోషం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. జనసేన మూల సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్న శాఖలను తమకు…
సాధారణంగా పట్టణాలతో పోలిస్తే పల్లెల్లో తక్కువ జనాభా నివసిస్తుంటారు. అభివృద్ధి కూడా తక్కువే కాబట్టి పన్నులు కూడా తక్కువ మొత్తంలోనే చెల్లిస్తారు. కాని రాజస్థాన్ లోని ఓ గ్రామంలో పరిస్థితి భిన్నంగా ఉంది. పట్టణాలతో పోలిస్తే జనాభాలో తక్కువే అయినా.. వారు పన్నులు కోట్లులో చెల్లిస్తారు.
Dharani Special Drive: ధరణి సమస్యల పరిష్కారం కోసం మధ్యాహ్నం 12:30కి సచివాలయంలో ధరణి కమిటి సమావేశం కానుంది. ధరణి సమస్యల పరిష్కారానికి నిర్వహించిన డ్రైవ్ పై కమిటీ సమీక్షించనుంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో అధ్యాపకుల, సిబ్బంది కొరతను తీర్చడానికి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రకటించింది. 2021 నుండి రాష్ట్రంలో ఉన్న 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఖాళీగా ఉన్న 4356 టీచింగ్ పోస్టులను కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వెంటనే స్పందించి పోస్టుల భక్తీకి గ్రీన్…
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు (Mallikarjun Kharge) కేంద్రం భద్రత పెంచింది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.