Harish Rao : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకుంటూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా నాణ్యమైన ఆహారం అందించలేని పరిస్థితి నెలకొన్నదని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పురుగులతో కూడిన అన్నం అందించిన ఘటనను గుర్తుచేస్తూ, “ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో…
Rishab Shetty : కాంతార చాప్టర్ 1తో భారీ హిట్ అందుకున్నాడు రిషబ్ శెట్టి. ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లో భారీ క్రేజ్ పెంచేసుకున్నాడు. ఈ సినిమా ఏకంగా రూ.710 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకా థియేటర్లలో ఆడుతూనే ఉంది. అయితే తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా అమితాబ్ నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ కు వెళ్లాడు రిషబ్ శెట్టి. ఇందులో మొత్తం 12 ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన రిషబ్..…
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది విద్యార్థులకు గుడ్ న్యూస్. రాబోయే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం మరో సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది.
Manchu Lakshmi : మంచు లక్ష్మీ ఈ నడుమ సేవా కార్యక్రమాలతో ఆకట్టుకుంటోంది. ఆమె నటించిన దక్ష మూవీ సెప్టెంబర్ 19న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్లు చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా అమరావతిలో పది స్కూళ్లను దత్తత తీసుకుంది. మనకు తెలిసిందే కదా.. మంచు లక్ష్మీ టీజ్ ఫర్ ఛేంజ్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకుని వాటిని డెవలప్ మెంట్ చేస్తోంది. తాజాగా…
ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. అన్ని స్థాయిల అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలను ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వ టీచర్లలో బోధనా సామర్థ్యం పెంచేందుకు ఈసారి శిక్షణ కూడా ఇచ్చారు. ఇప్పటికే.. రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా మారాయి. మంచి భవనాలు, రంగురంగుల బొమ్మలతో గోడలు, అత్యాధునిక వసతులతో క్లాస్ రూమ్‌లు, నాణ్యమైన విద్యాబోధన, పైగా ఇంగ్లిష్ మీడియం కూడా ప్రవేశ పెట్టారు.
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 571 ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి ఐసీసీసీ కేంద్రంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయుల శిక్షణ, ఇతర అవసరాల విషయంలో…
CM Revanth Reddy : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలని… ఇందుకు అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత వ్యయమైనా వెనుకాడేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నామని సీఎం వెల్లడించారు.…
Schools Reopen : వేసవి సెలవులు ముగిశాయి. విద్యార్థుల బడిబాట ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. జూన్ 12న ఉదయం 9 గంటలకు తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ పాఠశాలలు పునఃప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. పిల్లలకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు ఉపాధ్యాయులు స్కూల్స్‌ను పండుగ వాతావరణంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26,067 ప్రభుత్వ పాఠశాలలు, 11,650 ప్రైవేటు పాఠశాలలు, 495 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, 194 మోడల్…
No Phones : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తరగతి సమయంలో మొబైల్ ఫోన్లు ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. రూరల్ ప్రాంతాల్లోని పాఠశాలల్లో కొన్ని సందర్భాల్లో టీచర్లు తరగతులు నిర్వహించకుండా ఫోన్‌లలో మునిగిపోయారని స్థానిక ప్రజా ప్రతినిధులు, తల్లిదండ్రులు డీఈఓలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ పరిస్థితులు పాఠశాలలపై నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉండటంతో, అడ్మిషన్లపై దుష్ప్రభావం పడే అవకాశాన్ని విద్యాశాఖ ఆందోళనగా చూస్తోంది. Ram Charan : రామ్ చరణ్ కి అరుదైన…
MLC Kavitha : తెలంగాణ శాసనమండలిలో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఎమ్మెల్సీ కవిత ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో విద్యావ్యవస్థ నాశనం అయిందని ప్రచారం చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ గణాంకాలే సమాధానమని ఆమె పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిన గణాంకాల ప్రకారం, గత పది సంవత్సరాల్లో తెలంగాణలో విద్యా వ్యవస్థ మెరుగుపడింది. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ప్రైవేట్ పాఠశాలల సంఖ్య తగ్గిందని కేంద్ర గణాంకాలే చెబుతున్నాయని…