Manchu Lakshmi : మంచు లక్ష్మీ ఈ నడుమ సేవా కార్యక్రమాలతో ఆకట్టుకుంటోంది. ఆమె నటించిన దక్ష మూవీ సెప్టెంబర్ 19న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్లు చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా అమరావతిలో పది స్కూళ్లను దత్తత తీసుకుంది. మనకు తెలిసిందే కదా.. మంచు లక్ష్మీ టీజ్ ఫర్ ఛేంజ్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకుని వాటిని డెవలప్ మెంట్ చేస్తోంది. తాజాగా అమరావతిలో ఈ కార్యక్రమం చేపట్టింది. ఇందుకు సంబంధించిన విషయాలను కూడా ఆమె మీడియాతో పంచుకుంది. మేం మా సంస్థతో పాటు ఇంకొందరి సాయంతో ఈ కార్యక్రమం చేపట్టాం.
Read Also : Yellamma : ఎల్లమ్మ కథకు తెలుగులో హీరో దొరకట్లేదా..?
రీసెంట్ గా తెలంగాణలో పది స్కూళ్లను దత్తత తీసుకున్నా. ఇప్పుడు ఏపీలోని అమరావతిలో పది గ్రామాల్లో ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకుంటున్నాం. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా కర్ణాటక, తమిళనాడులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టాం. ఇప్పుడు అమరావతికి రావడం సంతోషంగా ఉంది. స్కూళ్లలో ఏమేం కావాలో అవన్నీ మేం తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాం. పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మేం అన్ని చర్యలు తీసుకుంటున్నాం అంటూ తెలిపింది మంచు లక్ష్మీ. రీసెంట్ గానే తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఇలాంటి కార్యక్రమం చేపట్టారు.
Read Also : Little Hearts : ఆ విషయంలో మౌళిని చూసి మిగతా హీరోలు నేర్చుకోవాల్సిందే..