Rishab Shetty : కాంతార చాప్టర్ 1తో భారీ హిట్ అందుకున్నాడు రిషబ్ శెట్టి. ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లో భారీ క్రేజ్ పెంచేసుకున్నాడు. ఈ సినిమా ఏకంగా రూ.710 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకా థియేటర్లలో ఆడుతూనే ఉంది. అయితే తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా అమితాబ్ నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ కు వెళ్లాడు రిషబ్ శెట్టి. ఇందులో మొత్తం 12 ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన రిషబ్.. కేబీసీ షో ద్వారా మొత్తం రూ. 12.50 లక్షలను గెలుచుకున్నాడు.
Read Also : Shivani Nagaram : ఆ హీరో కోసం ఏం చేయడానికైనా రెడీ.. క్రేజీ హీరోయిన్ కామెంట్
ఈ డబ్బు ఏ చేస్తారు అని అమితాబ్ ప్రశ్నించాడు. నేను రిషబ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నాను. ఈ డబ్బు ద్వారా నా ఫౌండేషన్ తో ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేస్తాను. వసతులు ఏర్పాటు చేస్తాను. అలాగే దైవనర్తకులకు సాయం చేస్తాను అంటూ తెలిపాడు రిషబ్. అతని సమాధానానికి అమితాబ్ మెచ్చుకున్నాడు. మీ సమాధానం నాకు బాగా నచ్చింది. మీకు ఈ డబ్బుతో పాటు బైక్ కూడా ఇస్తాను అంటూ తెలిపాడు. ఆ మాటలకు రిషబ్ థాంక్స్ తెలిపాడు. వీరిద్దరి సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : JR NTR : ఎన్టీఆర్ పై ఆ బ్యాడ్ సెంటిమెంట్ తొలగిపోయినట్టే..