ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు త్వరలోనే భారీ ఎత్తున పదోన్నతులు లభించనున్నాయి. ఇందుకు సంబంధించిన నోట్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నోట్‌ను అన్ని జిల్లా, డివిజన్, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పంపించింది. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్ చేయడం వల్ల వచ్చే జూన్‌లోగా 30వేల మంది SGTలకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ రానుంది. Read Also: రూ.10 నాణేల చెల్లుబాటుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అటు రాష్ట్రంలో కొత్తగా…
ఏపీ వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. జూన్ 30 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలని సూచించారు. జూలై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలని స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ… ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలపై స్పందించారు.…
కరోనా బాధితులకు సత్వర సేవలు అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ మరో కార్యక్రమం మొదలుపెట్టింది. కోవిడ్ బాధితులు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కరోనాకు వైద్యం సాయం పొందేలా ఏర్పాట్లు చేసింది. దీని కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రత్యేకంగా ఒక నంబరును కేటాయించింది. కరోనాకు టెలీమెడిసిన్ సాయం కావాలనుకునే వారు 8801033323 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వొచ్చని ఎన్టీఆర్ ట్రస్ట్ సూచించింది. ఇలా మిస్డ్ కాల్ ఇచ్చిన వారి మొబైల్ ఫోన్‌కు టెలిమెడిసిన్ సేవలు అందించించే జూమ్ కాల్…
ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో పాటు పొరుగు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులతో పోటీ పడేందుకు వీలుగా ఇకపై ఏసీ బస్సుల్లో అవసరాన్ని బట్టి ఛార్జీలు తగ్గించేలా ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ ప్రభావం, చలి కాలం కారణంగా ప్రస్తుతం ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రద్దీని బట్టి ఛార్జీలు వసూలు చేస్తామని అధికారులు తెలిపారు. Read Also: ఏపీలో కొత్త లెక్కలు……
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తన భార్య హేజల్ కీచ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు యువరాజ్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు. అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపాడు. ఈ ప్రపంచంలోకి ఓ చిన్నారి వచ్చిన సందర్భంగా తమ గోప్యతను అభిమానులందరూ గౌరవించాలని యువరాజ్ విజ్ఞప్తి చేశాడు. Read Also: టీమిండియాకు ఐసీసీ భారీ జరిమానా.. ఎందుకంటే? ఈ విషయం…
పండుగ సమయాల్లో 50 శాతానికి పైగా ఛార్జీలు వసూలు చేసే ఏపీ ఎస్ ఆర్టీసీ అధికారులకు అన్ సీజన్లో ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. విజయవాడ – హైదరాబాద్ మధ్య తిరిగే వివిధ బస్సులకు ఛార్జీలు తగ్గించారు. విజయవాడ- హైదరాబాద్ మధ్య ఛార్జీలు తగ్గించాలని నిర్ణయించారు. ఇంద్ర, అమరావతి, గరుడ, నైట్ రైడర్, వెన్నెల స్లీపర్ బస్సుల్లో 20 శాతం వరకు ఛార్జీలు తగ్గిస్తామని ఆర్‌ఎం యేసు దానం తెలిపారు. విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లేవారు ఆదివారం.…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కరువు భత్యం (డీఏ)ను పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు మూడు విడతల డీఏ బకాయిలకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ బుధవారం రాత్రి జారీ చేసింది. దీంతో ఉద్యోగుల మూలవేతనంలో 7.28 శాతంగా ఉండే డీఏ 17.29 శాతానికి పెరగనుంది. దీంతో పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలకు బదులుగా ఈ కొత్త లెక్క వర్తించనుంది. పెరిగిన డీఏ…
ఏపీలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం సీనియర్ కేటగిరీలో అసిస్టెంట్, స్టెనో, అకౌంటెంట్, ట్రాన్స్‌లేటర్ తదితరులకు రూ.17,500 నుంచి రూ.21,500కు జీతం పెరిగింది. మరోవైపు జూనియర్ విభాగంలో అసిస్టెంట్, స్టెనో, డ్రైవర్, టైపిస్ట్, మెకానిక్, ఫిట్టర్ తదితరులకు జీతాన్ని రూ.15వేల నుంచి 18,500కి పెంచుతున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరితో…
ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు ప్రకటించిన తెలంగాణ ఇంటర్ బోర్డు మరో గుడ్‌న్యూస్ అందించింది. రీవాల్యూయేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసిన వారు.. తమ దరఖాస్తును శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి రద్దు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు రీ వాల్యూయేషన్, రీ కౌంటింగ్ కోసం విద్యార్థులు చెల్లించిన ఫీజును తిరిగి పొందవచ్చని ఇంటర్ బోర్డు పేర్కొంది. ఫిబ్రవరి 1 నుంచి కాలేజీలలోని ప్రిన్సిపాళ్ల ద్వారా నగదును తీసుకోవచ్చని సూచించింది.…
ఆశా వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అందించింది. ఆశావర్కర్ల నెలవారీ ప్రోత్సాహకాలను 30శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కింద పనిచేస్తున్న, నేషనల్ హెల్త్ మిషన్ కింద పనిచేస్తున్న ఆశా వర్కర్లకు ఈ పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. నెలవారీ ప్రోత్సాహకాలతో ఆశావర్కర్ల నెలవారీ జీతం పెరగనుంది. తెలంగాణ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం మేరకు ఆశావర్కర్లు ఇకపై నెలకు రూ.7,500 జీతం బదులుగా రూ.9,750 అందుకోనున్నారు.…