రాష్ట్రంలో 7 వేల పైచిలుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసాం. నిన్న సాయంత్రం వరకే 77 శాతం ధాన్యం కొనుగోలు చేశాం అని సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 90 లక్షల మంది రైతుల వద్ద…11వేల 500 కోట్ల విలువైన 61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటి వరకు కొనుగోలు చేశాం. నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేటలో ధాన్యం లేక కొనుగోలు కేంద్రాలు మూసివేశాము అన్నారు. ఒకటి రెండు…
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అనంతరం రైతులకు చెల్లింపులకు వీలుగా ముఖ్యమంత్రి 26 వేల కోట్లు సిద్ధంగా ఉంచారు అని మంత్రి హరీష్ రావు అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు 24 గంటల్లో జమ చేయాలన్నదే ధ్యేయం. మిల్లులో ధాన్యం దించిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలి. ట్యాబ్ ఎంట్రీ పూర్తి కాగానే 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలి. ధాన్యం కొనుగోలు చేసి ట్యాబ్ ఎంట్రీ కానీ…
రోడ్ల నిర్మాణ చెల్లింపుల్లో కొత్త విధానం అమల్లోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. పూర్తి చేసిన పనికి నేరుగా బ్యాంకుల ద్వారానే కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిపేలా వెసులుబాటు కల్పించింది. రోడ్ డెవలప్మెంట్ కార్పోరేషన్- RDC ఎండీ కాంట్రాక్టర్ల జాబితాను CFMS ద్వారా సంబంధిత బ్యాంకులకు అందచేయాలని ఆదేశించింది. విడుదల చేయాల్సిన నిధుల వివరాలను బిల్లులతో సహా CFMS ద్వారా బ్యాంకులకు అందచేయాలని సూచించింది. RDC ఎండీ ఖాతాకు నిధులు విడుదల చేసి అక్కడి నుంచి కాంట్రాక్టర్ల ఖాతాలకు జమ చేయనున్నాయి…