దేశంలోని 14 రాష్ట్రాలకు రెవెన్యూలోటు గ్రాంటు కింద 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్రం రూ.7,183.42 కోట్ల నిధులను విడుదల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈ రాష్ట్రాలన్నింటికీ రూ.86,201 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని లెక్కించి ఆ మొత్తాన్ని 12 సమాన వాయిదాల్లో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సంఘం సూచించింది. అందులో తొలివిడత నిధులను శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూ లోటు కింద రూ.879.08 కోట్ల…
శ్రీవారి భక్తులకు టీటీడీ (Tirumala Tirupati Devasthanams) మరో శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వయోవృద్ధులు, వికలాంగుల దర్శనాలను పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతిరోజూ 1000 మంది చొప్పున భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 10 గంటలకు, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వయో వృద్ధులు, వికలాంగులకు దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ప్రత్యేక దర్శనాలను(Special Darshan) టీటీడీ రద్దు చేసిన సంగతి తెలిసిందే.…
తెలంగాణలో టీచర్ల ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గురువారం రాత్రి తెలంగాణ సర్కారు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో టెట్ పరీక్ష దరఖాస్తులు స్వీకరిస్తామని విద్యాశాఖ తెలిపింది. జూన్ 12న టెట్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. అభ్యర్థులు నోటిఫికేషన్ కాపీని ఈ నెల 25 నుంచి tstet.cgg.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది.…
హైదరాబాద్ జేఎన్టీయూలో ఈనెల 15, 16 తేదీల్లో మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 150 కంపెనీలు పాల్గొంటున్నాయని యూనివర్సిటీ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ సురేష్ వెల్లడించారు. ఆసక్తిగల నిరుద్యోగులు విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. పదో తరగతి నుంచి టెక్నాలజీ విద్య వరకు అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చని తెలిపారు. అన్ని రకాల కంపెనీలు పాల్గొంటున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సాధారణ డిగ్రీలు…
మరో రెండు వారాల్లో ఐపీఎల్-15 సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టుకు శుభవార్త అందింది. ఆ జట్టు మెగా వేలంలో భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఈ సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాడు. మైదానంలో ఆర్చర్ బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్న వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన ముంబై అభిమానులు…
రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ ఈనెల 11న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. సాహో సినిమా తర్వాత దాదాపు మూడేళ్ల విరామం అనంతరం ప్రభాస్ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో రాధేశ్యామ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను కూడా పాన్ ఇండియాగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ క్రమంలో ప్రభాస్ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఈ మూవీ ఐదో ఆటకు అనుమతిస్తూ ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. మార్చి…
తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 91,147 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిని ఈరోజు నుంచే నోటిఫై చేస్తున్నామన్నారు. అందులో 80,039 ఉద్యోగాలకు ఇవాళ్టి నుంచే శాఖల వారీగా నోటిఫికేషన్లు వస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు 95శాతం ఉద్యోగాలు స్థానికులే పొందుతారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా పోలీస్…
నాబార్డ్ వార్షిక ప్రణాళికపై బుధవారం ఏపీ సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, నాబార్డ్ ఛైర్మన్ జీఆర్ చింతల హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చేపడుతున్న పలు కార్యక్రమాలకు నాబార్డ్ సహకరిస్తోందన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ నాబార్డ్, బ్యాంకులు సహాయం చేశాయని సీఎం జగన్ గుర్తు చేశారు. రైతుకు విత్తనం నుంచి పంట విక్రయం వరకూ…
కరోనాతో గత రెండేళ్లుగా జీతాల పెంపు లేని ప్రైవేటు ఉద్యోగులకు అయాన్స్ సంస్థ సర్వే తీపికబురు చెప్పింది. 2022 ఏడాదిలో జీతాల విషయంలో దేశంలోని ప్రముఖ కంపెనీలు ఐదేళ్ళ గరిష్ఠ స్థాయిలో ఇంక్రిమెంట్లు ఇస్తాయని సర్వే వెల్లడించింది. సగటున 9.9% వేతనాల పెంపు ఉంటుందని అయాన్ సంస్థ తెలిపింది. 2021లో వేతనాల పెంపు సగటు 9.3 శాతంగా ఉందని గుర్తు చేసింది దీంతో ఈ ఏడాది ఇంక్రిమెంట్లు పెరుగుతాయని సర్వే అంచనా వేసింది. మరోవైపు బ్రిక్స్ కూటమిలోని…