ఏపీ వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. జూన్ 30 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలని సూచించారు. జూలై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలని స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ… ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలపై స్పందించారు. పీఆర్సీ సహా ఉద్యోగుల కోసం కొన్ని ప్రకటనలు చేశామని ఆయన తెలిపారు.
Read Also: ఏపీలో విషాదం.. కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి
ఉద్యోగులకు మంచి జరగాలనే వారి సర్వీసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచామని సీఎం జగన్ వెల్లడించారు. జూన్ 30లోగా కారుణ్య నియామకాలు జరపాలన్నారు. యుద్ధప్రాతిపదికన కారుణ్య నియామకాలను చేపట్టాలని అధికారులకు సూచించారు. జగనన్న స్మార్ట్‌టౌన్‌షిప్స్‌లో రిబేటుపై స్థలాలు కేటాయించామని, 10 శాతం స్థలాలను 20 శాతం రిబేటుపై కేటాయించామన్నారు. స్థలాల కేటాయింపునకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాలని సీఎం జగన్ తెలిపారు. మార్చి 5లోగా స్థలాలు కోరుతున్న ఉద్యోగుల పేర్లను రిజిస్ట్రేషన్ చేయాలని పేర్కొన్నారు.