ఏపీలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం సీనియర్ కేటగిరీలో అసిస్టెంట్, స్టెనో, అకౌంటెంట్, ట్రాన్స్‌లేటర్ తదితరులకు రూ.17,500 నుంచి రూ.21,500కు జీతం పెరిగింది.
మరోవైపు జూనియర్ విభాగంలో అసిస్టెంట్, స్టెనో, డ్రైవర్, టైపిస్ట్, మెకానిక్, ఫిట్టర్ తదితరులకు జీతాన్ని రూ.15వేల నుంచి 18,500కి పెంచుతున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరితో పాటు సబార్డినేట్, వాచ్‌మెన్, కుక్, చౌకీదార్ తదితరుల జీతాన్ని రూ.12వేల నుంచి రూ.15వేలకు పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెరిగిన జీతాలు జనవరి నెల నుంచి అమలు కానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.