Bandi Sanjay Kumar: పసుపు రైతుల జీవితాల్లో కొత్త కాంతులు రాబోతున్నయ్..
- ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదే
- బోర్డును సాధించిన అరవింద్‌కు అభినందనలు
- సహకరించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ధన్యవాదాలు
- పసుపు బోర్డు వల్ల ఈ ప్రాంత రైతులకు అనేక ప్రయోజనాలు
- పసుపు రైతులకు గిట్టుబాటు సమస్యే ఉండదు
- పసుపు బోర్డుకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం
- బోర్డు సాధనకు పోరాడిన పసుపు రైతులందరికీ హ్యాట్సాఫ్
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు పండించే రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, తనను గెలిపిస్తే పసుపు బోర్డును ఏర్పాటు చేయిస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చి.. అనేక ఇబ్బందులు పడ్డ అరవింద్ అనుకున్నది సాధించినందుకు ఆనందంగా ఉందన్నారు. బోర్డు ఏర్పాటుకు సహకరించిన మంత్రి పీయూష్ గోయల్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లోని తన కార్యాలయం నుంచి వర్చువల్‌గా హాజరై ప్రసంగించారు. బోర్డు ఏర్పాటు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.
READ MORE: Pani Puri: పానీపూరి తింటే అనారోగ్య సమస్యలే కాకుండా లాభాలున్నాయని తెలుసా?
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
“అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు రైతుల పండుగ. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రజలకు శుభవార్త అందించిన మహనీయుడు ప్రధాని నరేంద్ర మోడీ, సహకరించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు, ఈ బోర్డు ఏర్పాటులో కర్త, కర్మ, క్రియగా ఉంటూ మొండిపట్టుతో విజయం సాధించిన ఎంపీ ధర్మపురి అరవింద్, బోర్డు ఛైర్మన్ గా నియమితులైన పల్లె గంగారెడ్డికి, స్థానిక ఎమ్మెల్యేలకు, పసుపు రైతులకు అభినందనలు. ఈ శుభ ఘడియల్లో పసుపు బోర్డును ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. గతంలో పసుపు బోర్డు కోసం 178మంది పసుపు రైతులు లోక్ సభ ఎన్నికల్లో నామినేషన్లు వేసి పసుపు బోర్డు అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ‘‘బీజేపీ ఎంపీగా గెలిచిన తరువాత పసుపు బోర్డును తీసుకురాకపోతే రాజీనామా చేస్తా’’ నని ధర్మపురి అరవింద్ రాతపూర్వకంగా హామీ ఇచ్చి అనేక ఇబ్బందులు పడ్డారు. చివరికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. వారికి ప్రత్యేక అభినందనలు.” అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.
READ MORE: Gaza Truce Deal: ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి.. బందీలు విడుదలయ్యే ఛాన్స్..
పసుపు బోర్డు ఏర్పాటువల్ల ఈ ప్రాంత ప్రజలకు అనేక ప్రయోజనాలు కలగబోతున్నయని బండి సంజయ్ తెలిపారు. “తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు కలగబోతున్నయ్. పసుపు ఉత్పత్తుల ధరను బోర్డు నిర్ణయిస్తుంది. పసుపు దిగుబడి ఎక్కువైనా గిట్టుబాటు ధర రాదనే బాధే ఉండదు. పసుపు బోర్డే రైతు ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేసి వాటిని ప్రత్యేక స్టోరేజీల్లో ఉంచుతుంది. బ్రాండింగ్, ప్రమోషన్ స్కీమ్స్, ప్యాక్కింగ్ తోపాటు జాతీయంగా, అంతర్జాతీయ ఎగుమతులను చేసే అవకాశముంది. ఏటా పసుపు బోర్డుకు కేంద్రం బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తుంది. ప్రకృతివైపరీత్యాలవల్ల పంట నష్టపోతే రైతులు నష్టపోకుండా పంట బీమా ఉంటుంది. క్వాలిటీ డిపార్ట్మెంట్ ఏర్పాటు ద్వారా నిరంతరం క్వాలిటీ చెక్, క్వాలిటీ పెంచే విధంగా చర్యలు తీసుకుంటారు.” అని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!