ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా మహాశక్తి పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపింది. ఈ పథకంలో భాగంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వనుంది ప్రభుత్వం.. ఈ పథకం అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.
ఏపీలోని కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏపీలో జరగబోయే గోదావరి పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2027లో జరగనున్న గోదావరి నది పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్‌కు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. పెన్షనర్ల ఖాతాలకు సకాలంలో పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ బదిలీ అయ్యేలా బ్యాంకులు నిర్ధారించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అన్ని బ్యాంకులు ప్రతినెలా చివరి తేదీలో లబ్ధిదారుల ఖాతాల్లో పింఛను జమ చేయాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు దారులకు సబ్సిడీపై కందిపప్పు, పంచదార పంపిణీ చేసే కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో మంగళవారం మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించారు.
ఏపీలో మద్యం ప్రియులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా పండుగకు ముందే మద్యం షాపులు అందుబాటులోకి వస్తాయని ఏపీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గత ప్రభుత్వం మద్యం పాలసీ ద్వారా దోపిడీ చేసింది.. ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ షాప్స్ నిర్వహణ జరిగేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
డీఎస్సీ-2008 అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన డీఎస్సీ-2008 అభ్యర్థులను తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో.. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని డీఈవో ఆఫీసుల్లో దరఖాస్తులకు అవకాశం కల్పించింది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 5 వరకు సర్టిఫికెట్ పరిశీలన జరుగనుంది.
Sridhar Babu: తెలంగాణ గ్రామ ప్రజలకు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు శుభవార్త చెప్పారు. కేంద్ర సహకారంతో టీ ఫైబర్ నెట్ట ద్వారా అన్ని గ్రామాలకు 20 ఎంబీ స్పీడ్ తో ఇంటర్ నెట్ ఇచ్చేందుకు నిర్ణయించామని శ్రీధర్ బాబు తెలిపారు.
కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్‌లో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ రోజు నాలుగో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో భాగంగా.. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ అంశంపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్దారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతి నెలలా కాకుండా.. సెప్టెంబర్ నెలలో ముందుగానే పెన్షన్ ఇవ్వనుంది. ప్రతి నెలా 1వ తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈనెల 31వ తేదీనే (శనివారం) పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడం.. ఆ రోజు ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.