పసుపు రైతులకు సంక్రాంతి కానుకగా కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. మంగళవారం నుంచి నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని తెలిపింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ రూల్స్ తీసుకొచ్చింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఖాతాదారుల ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించకుంటే జరిమానా విధించనున్నట్లు తెలిపింది. ఈ జరిమానాను ఖాతాదారులకు పరిహారంగా అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాలతో ఖాతాదారులకు బ్యాంకులు ఇకపై రోజుకు రూ. 100 చెల్లించనున్నాయి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం బ్యాంకులు కస్టమర్ ఫిర్యాదులను ఒక నెలలోపు పరిష్కరించాలి. ఆ లోపు సమస్య పరిష్కారం కాకపోతే రోజుకు రూ.100 జరిమానా…
సంక్రాంతికి ఊరెళ్లే వారికి ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి సందర్భంగా.. ఎటువంట అదనపు ఛార్జీలు లేకుండా, సాధారణ ఛార్జీలతోనే సంక్రాంతి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ తెలిపింది. సంక్రాంతి పండగ దృష్ట్యా.. 7,200 ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ కార్యాచరణ రూపొందించింది.
ప్రముఖ బైక్ కంపెనీ కవాసకి ఇండియా.. తన నింజా లైనప్‌పై డిసెంబర్ 2024లో బంపర్ ఆఫర్‌లను అందిస్తోంది. ఈ జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ భారతీయ మార్కెట్లో మూడు నింజా బైక్‌లపై తగ్గింపు ఆఫర్‌లను అందిస్తోంది. ఈ తగ్గింపు ఆఫర్ కింద కవాసకి నింజా 500, కవాసకి నింజా 300, కవాసకి నింజా 650పై వేల రూపాయల తగ్గింపుతో అందజేస్తున్నారు.
TGSRTC: దూర ప్రాంత ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లో ఆర్టీసీ పికప్ వ్యాన్‌ల సేవలు అమల్లోకి వచ్చాయని ప్రకటించింది. ఈ సేవలు శుక్రవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయని పేర్కొంంది.
ఢిల్లీలో మరో 80 వేల మంది వృద్ధులకు నెలకు రూ.2000 పెన్షన్ ఇవ్వనున్నట్లు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. ఇందుకోసం 24 గంటల్లోనే 10 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లినా పింఛను ప్రారంభించాలని వృద్ధులు కోరేవారని కేజ్రీవాల్ చెప్పారు.
Ponnam Prabhakar: గీత కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా.. వచ్చే ఏడాది మార్చ్ తర్వాత గీత కార్మికులకు మోపెడులు ఇస్తాం తెలిపారు.
తెలంగాణలోని ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుంది. రేపు సాయంత్రంలోపు డీఏ (DA)పై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటి వేశారు సీఎం రేవంత్ రెడ్డి.
పర్యాటకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్ 26 నుంచి ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారాంతంలో ప్రముఖ ఆధ్యాత్మిక దేవాలయాలు, పంచారామ క్షేత్రాలు సందర్శించేలా ఒక రోజు టూర్ ప్యాకేజీకి పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తుందని మంత్రి వెల్లడించారు.
ఏటికొప్పాక, కొండపల్లి కళాకారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభవార్త చెప్పారు. అంకుడు, తెల్ల పొణికి చెట్లు విస్తారంగా పెంపునకు ఆయన ఆదేశాలిచ్చారు. ఉపాధి హామీ పథకంలో అంకుడు, తెల్ల పొణికి పెంపునకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఏటికొప్పాక, కొండపల్లి పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ, అటవీ, సామాజిక స్థలాల్లో వీటి పెంపకంపై దృష్టి సారించాలని పవన్ తెలిపారు.