H-1B, H-4 వీసా దరఖాస్తుదారులకు అమెరికా గుడ్‌న్యూస్ చెప్పింది. ఇటీవల అమెరికా కొత్త నిబంధనలు విధించడంతో హఠాత్తుగా ఇంటర్వ్యూలు ఆపేసింది. కొత్త షెడ్యూల్ ఎప్పటి నుంచో కూడా వివరాలు వెల్లడించలేదు. మొత్తానికి అమెరికా శుభవార్త చెప్పింది. డిసెంబర్ 15 (సోమవారం) నుంచి సోషల్ మీడియా స్క్రీనింగ్ ప్రారంభించనున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. దీంతో అన్ని హెచ్-1బీ, హెచ్-4, ఎఫ్, ఎం, జే వీసాలకు దరఖాస్తు చేసిన వారంతా తమ సెట్టింగ్‌లను పబ్లిక్‌కు మార్చుకోవాలని సూచించింది.
ఇది కూడా చదవండి: Off The Record : కొత్త పాలనకు సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్
అన్ని దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను అధికారులు పరిశీలించనున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లోని గోప్యతా సెట్టింగ్‌లను బహిరంగంగా ఉంచాలని విదేశాంగ శాఖ సూచించింది. దేశ భద్రత నేపథ్యంలో కొత్త రూల్స్ తీసుకొచ్చినట్లు అమెరికా తెలిపింది. అంతేకాకుండా దరఖాస్తుదారులు అమెరికాను ప్రేమిస్తున్నట్లుగా హామీ పత్రాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వలసలపై ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తాజాగా ఈ కొత్త ఆదేశం తీసుకొచ్చింది. అమెరికాలో విదేశీ కార్మికులను నియమించుకోవడానికి కంపెనీలు, ముఖ్యంగా టెక్నాలజీ కంపెనీలు ఉపయోగించే H-1B వీసా కార్యక్రమంలో దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ చర్యలు చేపట్టింది.
ఇది కూడా చదవండి: Physical Harassment : కోఠి మహిళా వర్సిటీలో వేధింపులు..!
H-1B వీసా హోల్డర్లలో ఎక్కువగా టెక్నాలజీ కార్మికులు, వైద్యులు సహా భారతీయ నిపుణులు ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు సొంత దేశానికి వెళ్లిపోకుండా.. ప్రతిభ కలిగిన వారిని కంపెనీలు గోల్డ్ కార్డు ద్వారా ఉంచుకోవాలని సూచించారు. ప్రతిభ కలిగిన భారతీయ విద్యార్థులను పంపించేయడం చాలా సిగ్గుచేటుగా ట్రంప్ అభివర్ణించారు.