Nirmala Sitharaman: భారతీయ ఉత్పత్తులకు శుభవార్త.. భారత్-యూఎస్ ట్రేడ్ డీల్‌పై నిర్మలమ్మ వ్యాఖ్య
- భారతీయ ఉత్పత్తులకు శుభవార్త
- భారత్-యూఎస్ ట్రేడ్ డీల్‌పై నిర్మలమ్మ వ్యాఖ్య
- భారత్‌పై 18 శాతానికి సుంకం తగ్గించిన ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-అమెరికా మధ్య కీలకమైన వాణిజ్య ఒప్పందం జరిగింది. సోమవారం మోడీ-ట్రంప్ మధ్య ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. అనంతరం భారత్‌పై 18 శాతానికి సుంకం తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు తిరిగి బలపడ్డాయి. అంతేకాకుండా రెండు దేశాల ఆర్థిక వ్యవస్థకు దోహదపడనుంది.
ఈ నేపథ్యంలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. భారతదేశం-అమెరికా వాణిజ్య ఒప్పందం మధ్య సుంకాల తగ్గింపును ప్రశంసించారు. ‘‘భారతదేశంలో తయారు చేసిన ఉత్పత్తులకు శుభవార్త’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘#MadeInIndia ఉత్పత్తులకు శుభవార్త. అవి ఇప్పుడు 18 శాతానికి తగ్గిన సుంకాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. PM @narendramodi, @POTUS నాయకత్వానికి ధన్యవాదాలు. ఈ అభివృద్ధి కోసం. మన రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాల ప్రజలు ప్రయోజనం పొందుతారు.’’ అని నిర్మలా సీతారామన్ రాసుకొచ్చారు.
Also Read
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
- PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
ఇది కూడా చదవండి: Modi-Trump: భారత్-యూఎస్ మధ్య చిగురించిన మైత్రి.. సుంకాలు తగ్గించిన ట్రంప్‌కు మోడీ కృతజ్ఞతలు
సోమవారం రాత్రి ట్రంప్-మోడీ మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణతో తిరిగి భారత్-అమెరికా మధ్య బంధాలు బలపడ్డాయి. ఇద్దరి నేతల మధ్య జరిగిన ఫోన్ కాల్ తర్వాత ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత్‌పై 18 శాతం సుంకం తగ్గించినట్లుగా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పారు. రష్యా చమురు నిలిపివేతకు భారత్ అంగీకరించిందని.. ఇక భారత్‌పై 25 శాతం అదనపు సుంకాలు ఉండబోవని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య మంచి వాణిజ్య ఒప్పందాలు జరిగినట్లుగా పేర్కొన్నారు. మోడీ గొప్ప స్నేహితుడు అంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఇండియా టుడే మ్యాగజైన్ కవర్‌పై ఉన్న ట్రంప్-మోడీ ఫొటోను పోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: US India Trade Deal: ట్రక్‌లోకి ట్రంప్-మోడీ దోస్తాన్.. చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ కంటే భారత్‌పై తక్కువ సుంకాలు..
ఇక భారత్‌పై 18 శాతం సుంకాలు తగ్గించినట్లుగా ట్రంప్ ప్రకటన రాగానే ప్రధాని మోడీ ఎక్స్‌లో కృతజ్ఞతలు తెలిపారు. ‘నా ప్రియమైన స్నేహితుడు ట్రంప్‌తో ఈరోజు మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై సుంకాలు ఇప్పుడు 18 శాతానికి తగ్గించబడిందని తెలుసుకుని చాలా సంతోషంగా ఉన్నాను. భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజల తరపున అధ్యక్షుడు ట్రంప్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యాలు కలిసి పని చేసినప్పుడు ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. పరస్పర సహకారానికి అపారమైన అవకాశాలను తెరుస్తుంది. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వం చాలా కీలకం. శాంతి కోసం ట్రంప్ చేసే ప్రతి ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుంది. భారత్-యూఎస్ భాగస్వామ్యాన్ని అపూర్వమైన శిఖరాలకు తీసుకెళ్లడానికి ట్రంప్‌తో కలసి పని చేయడానికి నేను ఎదురుచూస్తున్నాను.’’ అంటూ మోడీ రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Film Federation: ఫెడరేషన్ అధ్యక్షుడిపై విమర్శలపై 23 క్రాఫ్ట్స్ సీరియస్
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?