అస్సాంలో ఓ మహిళా ఆఫీసర్ కోట్లకు పడగలెత్తింది. డబ్బు సంపాదనే ధ్యేయంగా అవినీతికి తెరలేపింది. తక్కువ కాలంలోనే కోట్లు వెనకేసుకుంది. అధికారులు జరిపిన సోదాల్లో కోట్లలో నగదు దొరకడంతో సివిల్ సర్వీస్ అధికారి నుపుర్ బోరాను పోలీసులు అరెస్ట్ చేశారు.
సంగారెడ్డి జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో 4.8 కిలోల బంగారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
సింగపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తిరుచ్చి ఎయిర్‌పోర్టులో కోటి విలువైన బంగారంతో పట్టుకున్నట్లు కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ శుక్రవారం తెలిపింది. తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు గ్రీన్ ఛానల్‌ను దాటడానికి ప్రయత్నించిన ఓ ప్రయాణికుడిని అడ్డగించారు. అతని మోకాలి వద్ద పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని దాచిపెట్టినట్లు గుర్తించి దానిని స్వాధీనం చేసుకున్నారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తు్న్నారు. సార్వత్రిక ఎన్నికల తనిఖీల్లో భాగంగా విజయవాడ-హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి ఎన్‌హెచ్-65పై ఆదివారం నిర్వహించిన తనిఖీల్లో 14 కోట్ల విలువైన 66 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
Gold Seized At Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు సోమవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అధికారులు ఓ ప్రయాణికుడు వద్ద భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడు దాదాపు 449 గ్రాముల బంగారం అక్రమంగా తరలిస్తున్నాడని, దాని విలువ రూ. 28 లక్షల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. దీంతో బంగారాన్ని అక్రమంగా తరలించిన సదరు ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.…
శుక్రవారం, శనివారం మధ్య, ముంబై ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వేర్వేరు సందర్భాలలో ఎనిమిది మంది వ్యక్తులను అడ్డగించారు మరియు రూ. 3.2 కోట్ల విలువైన 6.19 కిలోల బంగారంతో పాటుగా మూడు బ్రాండెడ్ వాచీలను స్వాధీనం చేసుకున్నారు.. అధికారులు అడ్డగించిన వారంతా భారతీయ పౌరులని అంతర్జాతీయ విమానాల నుండి ల్యాండ్ అయిన తర్వాత పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మొదటి సందర్భంలో, విమానాశ్రయంలో కేరళ వాసి పట్టుబడ్డాడు. ఇండిగో విమానంలో దుబాయ్…
తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. 17 లక్షల విలువ చేసే 281 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద బంగారం దొరికింది.
పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో బంగ్లాదేశ్ నుంచి 27 బంగారు కడ్డీలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఓ మహిళను సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) గురువారం అరెస్టు చేసింది.
Gold Smuggling : తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది. దాదాపు 17.74కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.10.1కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.