Gold Seized At Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు సోమవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అధికారులు ఓ ప్రయాణికుడు వద్ద భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడు దాదాపు 449 గ్రాముల బంగారం అక్రమంగా తరలిస్తున్నాడని, దాని విలువ రూ. 28 లక్షల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. దీంతో బంగారాన్ని అక్రమంగా తరలించిన సదరు ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. దీనిసై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం 28 లక్షల విలువ చేసే 449 గ్రాముల బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు.