Flood Situation In Godavari: గోదావరి నది తీవ్ర ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం దగ్గర వరద ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
గోదావరి ఉప్పొంగి ప్రవహించడంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ నీటిమట్టం 11.75 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలో.. రానున్న కొద్ది గంటల్లో గోదావరి వరద మరింత పెరగనుంది.
Bhadrachalam Godavari: భద్రాద్రి కొత్తగూడెం వద్ద గోదావరికి మరోసారి వరద పోటెత్తింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు గ్రామానికి వరద తాకిడి ఎక్కువైంది, చింతూరు వద్ద శభరి నది ప్రమాదకరస్థాయిలో 45 అడుగులతో ఉరకలు వేస్తుండగా, కూనవరం వద్ద శబరి 38 అడుగులకు పెరిగింది. చింతూరు మెయిన్ సెంటర్‌లోకి వరద నీటి ప్రవాహం చేరడంతో ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.
Godavari River: నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన గోదావరి ఒక్కసారిగా పెరగటం ప్రారంభమైంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43.4 అడుగుల వద్ద ఉన్నది ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహిస్తుంది.
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్ర నుంచి భారీగా వరద పోటెత్తడంతో కందకుర్తి వద్ద అంతరాష్ట్ర బ్రిడ్జికి ఆనుకుని గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నగర ప్రజలకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్ మహా నగర తాగునీటి అవసరాలు మరింత మెరుగు పర్చేందుకు గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-2కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్.. జీవో Rt.No.345 జారీ చేశారు. గోదావరి రెండో దశ పనులకు రూ.5560 కోట్లు కేటాయించింది.
Godavari River: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం దోబూచులాడుతుంది. ఒకరోజు పెరిగి మరో రోజు తగ్గటం మళ్ళీ పెరగడం తగ్గటం జరుగుతుంది. గత నెల 21 నుంచి గోదావరికి వరద రావటం ప్రారంభించింది.
Godavari Flood: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. అయితే దిగువన శబరి నది వేగంగా వస్తుండడం తో స్వల్పంగా తగ్గుతుంది. ఎగువ నుంచి వచ్చిన గోదావరి వరదతో భద్రాచలం మీదుగా పోలవరం మీదుగా ధవలేశ్వరం నుంచి సముద్రంలో కలుస్తుంది.