Bhadrachalam Godavari: భద్రాచలం వద్ద మరోసారి విజృంభిస్తున్న గోదావరి..
- భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రస్తుతతం 45 అడుగులు..
- కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక..
- 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhadrachalam Godavari: భద్రాద్రి కొత్తగూడెం వద్ద గోదావరికి మరోసారి వరద పోటెత్తింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో సోమవారం నుంచి నీటిమట్టం పెరుగుతూ వస్తున్న గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను మించి ప్రస్తుతం 45 అడుగుల మేర ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 45 అడుగులు దాటిన నేపథ్యంలో అధికారులు తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. మరో మూడు అడుగులు పెరిగి 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక కూడా వెలువడే అవకాశం ఉంది.
Read also: AP Crime: ప్రాణం తీసిన పందెం.. రూ.2 వేల కోసం వెళ్తే..!
Also Read
- Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
- Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
- Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
- Khammam Cyber Fraud : రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ
ప్రస్తుతం భద్రాచలం వద్ద 9 లక్షల 46 వేల 412 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరికి వరద పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. కాగా..భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. ఈ నేపథ్యంలో అధికారులు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో గోదావరి వరద మరింత పెరుగుతోంది. ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుంచి గోదావరిలోకి లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండటంతో అధికారులు నిన్నటి నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు గోదావరిలోకి వదులుతున్నారు.
Read also: AP Crime: ప్రాణం తీసిన పందెం.. రూ.2 వేల కోసం వెళ్తే..!
తెలంగాణ చతిస్గడ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి..
ఎగువన కురిసిన భారీ వర్షాలకు ములుగు జిల్లా వాజేడు మండలం పేరూర్ వద్ద గోదావరి క్రమంగా పెరుగుతుంతి. వెంకటాపురం వాజేడు మండలాల్లోని గోదావరి పరివాహక లోతట్టు ప్రాంతాలు పంట పొలాలు జలమయమయ్యాయి. గోదారి ఎగువపోటుతో తెలంగాణ రాష్ట్ర సరిహద్దు టేకులగూడెం వద్ద రేగుమాగు వాగు ఉప్పొంగుతుంది. వరద నీరు 163 జాతీయ రహదారిపై చేరడంతో తెలంగాణ చతిస్గడ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు మండలం ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.
Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు వ్యక్తి మృతి.. అశ్లీల వీడియోలుతో..
తాజావార్తలు
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
-
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..