మహాశివరాత్రి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద ఘోర విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో స్నానాలకు దిగి ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. తక్షణమే రంగంలోకి దిగి పోలీసులు, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు ప్రారంభించారు. మహాశివరాత్రి సందర్భంగా నదిలో స్నానానికి వెళ్లిన యువకులు.. లోతు ఉన్న ప్రదేశాన్ని గుర్తించకపోవడంతో మునిగిపోయినట్టుగా భావిస్తున్నారు.
ములుగు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. మంగపేట మండలం చుంచపెల్లి వద్ద గోదావరి నది దాటి వచ్చిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు పులి అడుగులు గుర్తించారు. పులి పాద ముద్రలు అనుసరించి మల్లూరు లక్ష్మి నృసింహ స్వామి క్షేత్రం వైపు వెళ్లి ఉంటుందని అంచనాకి వచ్చారు. చుంచుపల్లి, పాలయిగూడెం, ఓడగుడెం, మల్లూరు, నిలాధ్రిపేట, బాలన్నగూడెం పరిసర ప్రాంతాల ప్రజలను మైక్ అనౌన్స్మెంట్ ద్వారా అప్రమత్తం చేశారు. పులి…
కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలను దక్కించుకోవాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు వీసమెత్తు నష్టం వాటిల్లకుండా ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ఆదేశించారు. అందుకు అవసరమైన సాక్ష్యాధారాలు, రికార్డులు, ఉత్తర్వులు సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను, న్యాయ నిపుణులను అప్రమత్తం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Rabi Season : గోదావరి జిల్లాలో రబీ సాగు కోసం డెల్టా కాలువలకు డిసెంబర్ 1 నుంచి ధవళేశ్వరం బ్యారేజి నుంచి నీటిని విడుదల చేయనున్నారు. కలెక్టర్ పి.ప్రశాంతి అధ్యక్షతన జరిగిన తూర్పుగోదావరి జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 2024- 25 రబీ సీజన్ లో తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టాల పరిధిలో 8 లక్షల 96 వేల 507 ఎకరాల ఆయకట్టుకు సాగు, మంచినీటి అవసరాలకు నీటిని…
Rajahmundry Road cum Rail Bridge : గోదావరి జిల్లాలకు మణిహారంగా నిలిచిన రాజమండ్రి రోడ్ కం రైలు బ్రిడ్జి 50 వసంతాలను పూర్తి చేస్తుంది. 1974 సంవత్సరంలో ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ బ్రిడ్జి 50 ఏళ్లుగా సేవలందిస్తుంది. ఆసియా ఖండంలోనే అతి పొడవైన రెండవ రోడ్ కం రైల్వే బ్రిడ్జిగా చరిత్రకు ఎక్కిన. దీనిపై నిత్యం పదివేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నారు. 60 ఏళ్లు సామర్థ్యంతో నిర్మించిన ఈ బ్రిడ్జి మనుగడ మరో 20…
Flood Flow Reduced: గోదావరి నది ప్రవాహం ఈరోజు (ఆదివారం) నిలకడగా కొనసాగుతుంది. గంట గంటకు క్రమేపీ గోదావరి వరద ప్రవాహం తగ్గుతుంది. ఇక, ధవళేశ్వరం, పోలవరం ప్రాజెక్టులకు భారీగా తగ్గిపోయిన వరద నీరు. ఇక, పోలవరం స్పిల్‌వే వద్ద నీటిమట్టం 31.655మీటర్లకు చేరింది.
నేటి నుండి రాజమండ్రి వద్ద గోదావరి నదిలో గణేష్ నిమజ్జనాలకు అనుమతి ఇచ్చారు అధికారులు.. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో రాజమండ్రిలో మూడు రోజులుగా గణేష్ నిమజ్జనాలు నిలిచిపోయాయి. ఇక, గోదావరిలో వరద ఉధృతి తగ్గడంతో.. గణేష్ నిమజ్జనాలు కోసం పుష్కర్ ఘాట్ వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న ర్యాంపులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా నదిలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు నిలిపివేశారు.. దీంతో వరుసగా రెండో రోజూ కూడా గణేష్ నిమజ్జనాలు గోదావరిలో చేయడాన్ని నిలుపు వేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా నిమజ్జనానికి ఊరేగింపులతో గణేష్ విగ్రహాలు తీసుకుని వస్తున్న వాటిని పోలీసులు వెనక్కి తిప్పి పంపిస్తున్నారు.
Minister Tummala: గోదావరి నీటిమట్టం ఎంత పెరిగిన భద్రాచలం పట్టణంలో చుక్క నీరు రాకుండా చర్యలు చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.