Godavari River: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం దోబూచులాడుతుంది. ఒకరోజు పెరిగి మరో రోజు తగ్గటం మళ్ళీ పెరగడం తగ్గటం జరుగుతుంది. గత నెల 21 నుంచి గోదావరికి వరద రావటం ప్రారంభించింది. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి పెరిగి మళ్ళీ తగ్గటం ప్రారంభించింది. సుమారు 12 రోజులపాటు గోదావరి వరద ప్రభావం భద్రాచలం వద్ద కనిపించింది. నిన్న గోదావరి మరో మూడు అడుగుల పెరిగి మళ్ళీ ఈరోజు తగ్గటం ప్రారంభించింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 33.5 అడుగులకు చేరుకుంది. గోదావరి నీటిమట్టం తగ్గుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటిమట్టం 33.5 అడుగులుగా ఉంది. నిన్న ఒక్క రోజే మళ్ళీ ముడు అడుగులు గోదావరి పెరిగింది. ఎగువన గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు లేకపోవడం వల్ల అదే విధంగా దిగువన వున్న శబరి దగ్గర కూడా వరద లేకపోవడం నిలకడగా వుండడం వల్ల గోదావరిలో నీరు వేగంగా పోలవరం వెళ్తుంది. పోలవరం నుంచి ధవళేశ్వరం.
Read also: Srisailam Temple: శ్రీశైలంలో నేటి నుంచి శ్రావణ మాసోత్సవాలు.. భక్తులకు కీలక సూచనలు
మీదుగా సముద్రంలో కలుస్తోంది.. గత నెల 21వ తారీకు నుంచి గోదావరి పెరగటం ప్రారంభించింది. ఏటా జూలై, ఆగస్టు నెలలో గోదావరి వరదలు వస్తుంటాయి. అయితే ఆగస్టులోనే ఎక్కువగా గోదావరి వరదలు వస్తుంటాయి ..కానీ ఈసారి జూలై నెలలో వరదలు వచ్చాయి. గత నెల 23వ తేదీన 51.5 అడుగులకు వచ్చిన గోదావరి ఆ తర్వాత తగ్గుముఖం పట్టి 44 అడుగుల దగ్గర కు తగ్గి మళ్లీ పెరిగింది 53.9 అడుగులకి గత నెల 27 వ తేదిన గోదావరి పెరిగింది. దీంతో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ తరువాత గోదావరి నీటిమట్టం పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టింది. మళ్ళీ గత వారం రోజుల నుంచి గోదావరి తగ్గడం పెరగడం జరుగుతుంది.. 33 అడుగులకు తగ్గి మళ్లీ 37 అడుగులకు పెరిగింది.. నిన్న పెరిగిన గోదావరి మళ్ళీ ఈ రోజు తగ్గడం ప్రారంభించింది. 43 అడుగుల చేరుకుంటే మొదటి ప్రమాదం జారీ చేస్తారు. మొదటి ప్రమాద హెచ్చరిక కి ఇంకా ఆరు అడుగుల దూరంలో ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం ఉంది. గోదావరికి ప్రస్తుతం వరద వచ్చే అవకాశం లేదని అధికారులు అంటున్నారు.
MLC Elections: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటర్ల తుది జాబితా సిద్ధం