బనకచర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తెలంగాణతో నేను ఎప్పుడైనా గొడవపడ్డానా? అని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణ వాళ్లతో పోరాటం ఎందుకు? కట్టాలనుకుంటున్న ప్రాజెక్టులన్నీ కట్టుకోండి.. మిగిలిన నీటినే మేం వాడుకుంటాం అన్నారు.. ప్రాజెక్టుల విషయంలో తెలంగాణతో పోరాటం చేయను అని స్పష్టం చేశారు.. బనకచర్ల ప్రాజెక్టుపై పోరాటాలు అవసరం లేదు.. ఎవరి నీరు వారిది.. అవసరమైతే ఢిల్లీలో కూర్చొని మాట్లాడుకుందాం.. సముద్రంలోకి పోయే నీటిని ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో వాడుకుందాం అన్నారు చంద్రబాబు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ (మ) అంబట్ పల్లి వద్ద ఆరుగురు యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. ఈ సమాచారాన్ని పోలీసులకు అందించడంతో అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. రెస్క్యూ టీం సభ్యులు గజఈతగాళ్లు ,కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి ,గోదావరి నీటిలోకి దిగి అంచనా వేశారు. కాగా నది లోపల బోట్స్ తిరిగే అవకాశం లేకపోవడంతో రాత్రి అంతగా సేఫ్ కాదని భావించారు. నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సాధ్యం కాక బృందాలు వెనుతిరిగాయి.…
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని లంక వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతైన 8 మంది యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము వరకు గజ ఈత గాళ్లు, వలల సాయంతో ఎస్‌డీఆర్‌ఎఫ్ అధికారులు గోదావరిని జల్లెడ పట్టారు. ప్రమాదం జరిగిన సమీపంలో ఒక మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం వడ్డే మహేష్‌గా గుర్తించారు. ఇంకా ఏడుగురి యువకుల ఆచూకీ లభించలేదు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శేరిలంకకు…
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని దగ్గర గోదావరిలో ఎనిమిది మంది యువకులు గల్లంతు అయ్యారు.. ఓ పెళ్లికి హాజరు అయ్యి తిరిగి వెళ్తుండగా.. గోదావరిలో సరదాగా గడపడానికి వెళ్లారు స్నేహితులు..
Saraswati Pushkaralu : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలు రెండో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరంలో భక్తుల సందడి నెలకొంది. ఇక్కడ గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మొదటి రోజు లక్ష మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కాళేశ్వరంలో కుంభమేళాను తలపించేలా టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. భక్తులు నదిలో స్నానాలు ఆచరించడానికి ప్రత్యేక…
గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్సీ) లేఖ రాసింది. గోదావరి - బనకచర్ల లింక్ విషయంలో ఏపీ ముందుకెళ్లకుండా చూడాలని లేఖలో పేర్కొంది. ఎలాంటి అనుమతుల్లేకుండా ప్రాజెక్టు చేపడుతున్నారని గతంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపామని ఈఎన్సీ వెల్లడించింది. పనులు విభజన చట్టం, ట్రైబ్యునల్ అవార్డులకు విరుద్ధమని... తెలంగాణకు నష్టం జరుగుతుందన్న ఈఎన్సీ తెలిపింది.
Uttam Kumar Reddy : జలసౌధలో నీటిపారుదల శాఖాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కృష్ణా, గోదావరి నదులపై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయల సీమ ఎత్తిపోతల పథకంతో పాటు బంకచర్ల ఎత్తిపోతల పథకం నిర్మాణాలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిబంధనలకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా ప్రాజెక్టులు నిర్మిస్తుందని, ఏపీ నిర్మిస్తున్న ఆర్ఎల్ఐసితో పాటు బంకచర్ల ప్రాజెక్టుల వల్ల తెలంగాణా సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఇక్కడి తాగు…
Uttam Kumar Reddy : సీతారామ ప్రాజెక్ట్ మిగిలిన పనులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు భేటీ అయ్యారు. సత్తుపల్లి ట్రంక్ పనులు జనవరి నాటికి పూర్తి చేయాలని ప్రతిపాదించారు. సీతమ్మ సాగర్ బ్యారేజి నిర్మాణం పూర్తి చేస్తే జల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని నిర్మాణ పనులు వేగవంతం చేయాలని తుమ్మల నాగేశ్వర రావు కోరారు. ఈ సమావేశంలో సత్తుపల్లి ట్రంక్, సీతారామ ప్రాజెక్ట్…
కుమారుడు మరణించడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లి వద్దకు వచ్చిన ఓ వానరం.. ఆ తల్లిని ఓదార్చింది. ఇక, తన కుమారుడే వానరం రూపంలో తన వద్దకు తిరిగి వచ్చాడని.. ఆ మాతృమూర్తి కన్నీటి పర్యంతమైన ఘటన తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో చోటు చేసుకుంది..
Godavari: సీలేరు జలాలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని మూడు డెల్టాల పరిధిలో రబీ వరి పంటకు జీవం పోస్తున్నాయి. సీలేరు జలాశయం నుంచి ప్రతి రోజు 7 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు అధికారులు.