Godavari Flood: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. అయితే దిగువన శబరినది వేగంగా వస్తుండడంతో స్వల్పంగా తగ్గుతుంది. ఎగువ నుంచి వచ్చిన గోదావరి వరదతో భద్రాచలం మీదుగా పోలవరం మీదుగా ధవలేశ్వరం నుంచి సముద్రంలో కలుస్తుంది. పది రోజులు నుంచి భద్రాచలం వద్ద గోదావరి పెరుగుతూ తగ్గుతూ వస్తున్నది. ఈనెల 23 వ తేది నాడు 51.5 అడుగులకి చేరు కున్నది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఆ తర్వాత 44 అడుగుల తగ్గింది.అయితే మళ్లీ ఎగువ నుంచి వచ్చిన వరద వల్ల గోదావరి శనివారం నాడు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయాల్సిన వచ్చింది. 53.9 అడుగులకి పెరిగిన గోదావరి ఆ తర్వాత ముందు గా స్పీడ్ తగ్గుముఖం పట్టడం ప్రారంభించింది.
Read also: Tollywood: స్టార్ హీరో ముఖ్య అతిధిగా దర్శక సంజీవని మహోత్సవం కార్యక్రమం..
ఇక 24 గంటల వ్యవధిలో ఎనిమిది అడుగుల మేరకు గోదావరి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి 45 అడుగుల వద్ద ఉన్నది. గత రాత్రి ముడు గంటల నుంచి గోదావరి స్వల్పంగా తగ్గుతుంది. శబరి వేగంగా వస్తు నందువల్ల గోదావరికి ఎగ పోటు వస్తుంది. ఇందువల్ల స్వల్పంగా తగ్గుతుంది.. తూర్పు గోదావరి జిల్లాలో వున్న దొంకరాయి ప్రాజెక్టు నీళ్లు కూడా వదలడం వల్ల శబరి కి వరద పెరిగింది. 45 అడుగుల వద్ద గోదావరి వుండడం తో దీంతో మూడవ,రెండో ప్రమాద హెచ్చరికలను జారీ చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొన సాగుతుంది. ప్రస్తుతం 45 అడుగుల వద్ద గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. 43 అడుగులకు తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరిక ఉప సంహరణ జరుగుతుంది.
Read also: Telangana Assembly 2024: నేడు అసెంబ్లీ సమావేశాలు.. 19 శాఖల పద్దులపై చర్చ
కాగా మూడో ప్రమాద హెచ్చరిక వచ్చిన వద్ద నుంచి భద్రాచలం పట్టణంలోని ఏఎంసీ కాలనీలో కి నీళ్లు వచ్చాయి. ఇక్కడ ఉన్న తూమ్ లు పని చేయకపోవడం వల్ల పక్కనే ఉన్న వాగు అదే విధంగా డ్రైనేజీ వాటర్ అంతా కూడా కాలనీలోకి ఎంటర్ అయ్యాయి. దీంతో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి పునరావాస కేంద్రానికి బాధిత కుటుంబీకులను తరలించారు. ముడు రోజుల నుంచి పునరావాస కేంద్రం లోనే బాధిత కుటుంబాలు వున్నాయి. అయితే భద్రాచలంలో గోదావరిలో పూర్తిస్థాయిలో నీటిమట్టం తగ్గుతూనే ఇక్కడ కాలనీలోకి వచ్చిన నీళ్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. లేదా మోటార్లతో ఎత్తిపోయాల్సిన పరిస్థితి .అయితే ఇప్పటికిప్పుడు మోటార్లతో ఎత్తిపోయటం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది .దీంతో కాలనీవాసులు పునరావస కేంద్రంలోని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Libya Floods : వరదలకు కారణం వాళ్లే..12 మంది అధికారులకు 27ఏళ్ల జైలు శిక్ష