GoDaddy layoff: లేఆఫ్స్ జాబితాలో మరో కంపెనీ కూడా చేరిపోయింది. ప్రముఖ వెబ్ హోస్టింగ్ ప్లాట్ ప్లాట్‌ఫారమ్ గోడాడీ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. తన సిబ్బందిలో 8 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గోడాడీ సీఈఓ అమన్ భూటానీ మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్థిక పరిణామాల వల్లే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. సిబ్బందికి పంపిన ఈమెయిల్స్ లో ఈ ఉద్యోగులు తొలగింపుకు కారణాలు వెల్లడించారు.
Yahoo Layoff: టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ పర్వం నడుస్తూనే ఉంది. రోజుకో టెక్ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంటోంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో అని ఐటీ ఉద్యోగులు గుబులు పడిపోతున్నారు. ఉన్నపలంగా ఉద్యోగం నుంచి తొలగిస్తే తమ పరిస్థితి ఏంటని భయపడుతున్నారు ఉద్యోగులు. ఇప్పటికే టెక్ దిగ్గజ కంపెనీలు అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్ లు తమ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఆర్థిక మాంద్యం భయాలతోనే ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతోనే కంపెనీలు…
Inflation in UK forces Indian students to work for long hours: ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్య వస్తుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అమెరికా, యూకేతో పాటు పలు యూరప్ దేశాల్లో ద్రవ్యల్భణం కనిపిస్తోంది. రానున్న 6 నెలల నుంచి ఏడాది కాలంలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే యూకే తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతం అవుతోంది. బోరిస్ జాన్సన్ తరువాత ప్రధాని పీఠాన్ని అధిష్టించిన లిజ్ ట్రస్…
IT Layoffs: ఐఐటీలో చదివి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఉద్యోగి కూడా తాజా లేఆఫ్స్ నుంచి తప్పించుకోలేకపోయారు. ఐఐటీ గ్రాడ్యుయేట్ అంటే ఏ కంపెనీ అయిన కళ్లకద్దుకుని కొలువు ఇస్తుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా ప్రముఖ ఎడ్ టెక్ సంస్థ బైజూన్ రెండో విడత ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది. దాదాపుగా 1000 మందిని కొలువుల నుంచి తీసిపారేసింది.
US Layoffs: ఆర్థిక మాంద్యం భయాలు నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు వరసగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ టెక్ దిగ్గజాలు అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, ట్విట్టర్ ఇలా తమ ఉద్యోగులను నిర్ధాక్షిణ్యంగా తొలగించేశాయి. ఆయా కంపెనీలతో దశాబ్ధాల కాలం అనుబంధం ఉన్న ఉద్యోగులను కూడా తొలగించాయి. అమెరికాలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు ఊడాయి.
Ford to cut up to 3,200 jobs: అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ ఐటీ పరిశ్రమపైనే కాకుండా.. ఆటోమోబైల్ పరిశ్రమపై కూడా పడబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా గ్లోబర్ ఆటోమోబైల్ దిగ్గజం జర్మనీకి చెందిన ఫోర్డ్ 3200 మందిని ఉద్యోగాల నుంచి తొలగించబోతోంది. ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ మెటీరియల్స్ కోసం పెరుగుతున్న ఖర్చులు, ఆర్థికమాంద్యం భయాలతో ఇతర ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా యూరప్ ప్రాంతంలోనే ఉద్యోగాలు పోనున్నాయి.
Spotify To Begin Laying Off: టెక్ లేఆఫ్స్ పరంపర కొనసాగుతూనే ఉంది. రోజుకో కంపెనీ తమ ఉద్యోగులను తొలగిస్తున్నామని ప్రకటిస్తోంది. తాజాగా ప్రముఖ టెక్ కంపెనీ స్పాటిఫై కూడా తమ ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్ ఓ నివేదికలో వెల్లడించింది. ఈ వారంలో తొలగింపులు ఉండవచ్చని ప్రకటించింది. అక్టోబర్ నెలలో స్పాటిఫై గిమ్లెట్ మీడియా, పార్కాస్ట్ పోడ్ కాస్ట్ స్టూడియోల నుంచి 38 మందిని, సెప్టెంబర్ నెలలో ఎడిటోరియల్ ఉద్యోగులను తొలగించింది. అయితే ఎంత…
IT Layoffs: ఐటీ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. వరసగా పలు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో పలు ఐటీ ఉద్యోగులు కుటుంబాల్లో వణుకు మొదలైంది. ఎప్పుడు తమ ఉద్యోగం ఊడుతుందో అని బిక్కుబిక్కమంటున్నారు. ఇప్పటికే ప్రపంచస్థాయి ఐటీ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, మెటా వంటివి తమ ఉద్యోగులను తీసేశాయి. 2022లో మొదలైన ఈ లేఆఫ్స్ 2023లో తీవ్రస్థాయికి వెళ్తాయని నిపుణులు చెబుతున్నారు.
Laid off 3 times in 4 months: చాలా మందికి ఐటీ, సాఫ్ట్వేర్ ఉద్యోగం ఓ కల. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉందంటే లక్షల్లో జీతాలు, కార్ల, బంగ్లాలు అనే ఉద్దేశం సామాన్య ప్రజల్లో నాటుకుపోయింది. అయితే ఆ మత్తు దిగిపోతోంది ఇప్పుడు. నిర్ధయగా కంపెనీలు తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో టాప్ టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. టెక్ దిగ్గజ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్ ఇలా పలు కంపెనీలు…
Google Layoff: ఆర్థికమాంద్యం ఐటీ ఇండస్ట్రీలో సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో తెలియని పరిస్థితి. పెద్ద పెద్ద ఐటీ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. కొత్త, పాత అన్న తేడా లేకుండా ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. కంపెనీతో దశాబ్ధానికి పైగా అనుబంధం ఉన్న ఉద్యోగులను కూడా నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. దశాబ్ధకాలంగా పనిచేసిన కొందరు ఉద్యోగుల శ్రమ, అంకితభావం, విధేయతలను కంపెనీలు పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇప్పటికే ట్విట్టర్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ తన…