Twitter Layoffs: ఐటీ పరిశ్రమలో సంక్షోభం కొనసాగుతోంది. వరసగా టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి ట్విట్టర్ తో ప్రారంభం అయిన ఈ లేఆఫ్స్ ట్రెండ్ మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట, అమెజాన్ ఇలా అన్ని ప్రముఖ సంస్థల్లో కొసాగుతోంది. తాజాగా దేశీయ ఐటీ దిగ్గజం విప్రో కూడా ఫ్రెషర్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో కంపెనీలు తమ ఉద్యోగులను విడిచిపెడుతున్నాయి. ఖర్చులను తగ్గించుకునే పేరుతో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.
IT Layoffs: ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్నాయి. ప్రపంచం ఆర్థికమాంద్యం ముంగిట ఉంది. ఏకంగా మూడోవంతు ప్రపంచదేశాలు ఆర్థికమాంద్యబారిన పడుతాయని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) అంచనా వేసింది. ఏకంగా ప్రపంచంలో 30 లక్షల ఉద్యోగాలు ఊడుతుందని అంచానా వేసింది. గతేడాది కంటే 2023 చాలా కఠినంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 వరకు ఇలాగే పరిస్థితి ఉంటుందని అంచానా వేస్తున్నారు. ఈ ఏడాది జూన్ వరకు ప్రపంచం అంతా మాంద్యంలోకి వెళ్లే అవకాశం ఉంది.…
Google Layoff: ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు ఐటీ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇక గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్ కూడా ప్రపంచ వ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ శుక్రవారం ఓ మెమోలో తెలిపారు. మైక్రోసాఫ్ట్ 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు…
Microsoft Layoff: ఆర్థికమాంద్యం భయాలు టెక్ దిగ్గజ కంపెనీలను భయపెడుతున్నాయి. ఆదాయాలు తగ్గడంతో ఖర్చులను అదుపు చేసేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, మెటా వంటి సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. తాజాగా ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ కూడా చేరింది. ఏకంగా 10,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం నుంచే తొలగింపుల ప్రక్రియను చేపట్టింది. ఈ ఏడాది మూడో త్రైమాసికం కల్లా ఉద్యోగుల తొలగింపు ఉంటుందని ప్రకటించింది.
Microsoft Layoffs: ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం భయాలు టెక్ దిగ్గజాలను భయపెడుతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా ఈ జాబితాలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా చేరింది. 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ బుధవారం ప్రకటించింది.
Microsoft Layoffs: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులను తొలగించనుంది. ఇప్పటికే గ్లోబల్ టెక్ దిగ్గజాలు అయిన ట్విట్టర్, మెటా, గూగుల్ వంటి సంస్థలు నష్టాలను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గతేడాది ప్రకటించాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా ఈ జాబితాలో చేరింది. జనవరి 18 నుంచే ఉద్యోగులకు ఉద్వాసన ఉంటుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ కు 2,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 5-10 శాతం మందిని తొలగిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి. దాదాపుగా 11,000 మందిని…
RBI Governor on CryptoCurrencies: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంతదాస్ ఇటీవల ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అసలు వాటి వల్ల దేశానికి, ప్రజలకు ఏంటి ఉపయోగం అని నిలదీశారు. పైసా కూడా ప్రయోజనంలేని ఇలాంటివాటిని ఇంకా ప్రోత్సహిస్తే మరో ఘోర ఆర్థిక మాంద్యానికి దారితీయక తప్పదని హెచ్చరించారు. తన మాటలను రాసిపెట్టుకోవాలని, క్రిప్టో కరెన్సీలకు ముకుతాడు వేయకపోతే తాను చెప్పింది జరిగి తీరుతుందని బల్ల గుద్ది చెప్పారు.
Today (03-01-23) Business Headlines: పబ్లిక్ ఇష్యూకి హైదరాబాద్ సంస్థ: బ్యాంకులతో కలిసి ప్రీపెయిడ్ కార్డులను జారీచేసే హైదరాబాద్ సంస్థ జాగల్ ప్రీపెయిడ్ ఓవర్సీస్ సర్వీసెస్.. పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఫేస్ వ్యాల్యూ రూపాయితో కొత్త షేర్లను కేటాయించటం ద్వారా 490 కోట్ల ఫండ్‌రైజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి తెలిపింది.
Cisco Joins Global Wave Of Tech Lay-Offs, Will Cut 4,000 Jobs: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు, ద్రవ్యోల్భనం, ఆదాయం తగ్గిపోవడవంతో టెక్ దిగ్గజాలు వరసగా తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో మరో టెక్ దిగ్గజ సంస్థ చేరింది. సిస్కో గత నెలలో 4000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. తాజాగా ఈ తొలగింపు ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో దాదాపుగా 2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని…
US Company Fires 2,700 Employees Through Text Message: ఆర్థికమాంద్యం, ద్రవ్యోల్భనం, కొనుగోలు శక్తి క్షీణించడం ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్నాయి. ఆయా దేశాల్లో ప్రజలు పొదుపు చేసే పనిలో ఉన్నారు. ఫలితంగా వ్యాపారాలు తగ్గుతున్నాయి. దీంతో ఇటీవల కాలంలో అమెరికాలోని పలు టెక్ దిగ్గజాలు ఖర్చును తగ్గించుకునే పనిలో ఉద్యోగులను తొలగించుకున్నాయి. తాజాగా ఓ అమెరికన్ కంపెనీ తమ ఉద్యోగులను కేవలం ఓ టెక్ట్స్ మెసేజ్…