GoDaddy layoff: లేఆఫ్స్ జాబితాలో మరో కంపెనీ కూడా చేరిపోయింది. ప్రముఖ వెబ్ హోస్టింగ్ ప్లాట్ ప్లాట్‌ఫారమ్ గోడాడీ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. తన సిబ్బందిలో 8 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గోడాడీ సీఈఓ అమన్ భూటానీ మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్థిక పరిణామాల వల్లే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. సిబ్బందికి పంపిన ఈమెయిల్స్ లో ఈ ఉద్యోగులు తొలగింపుకు కారణాలు వెల్లడించారు. అన్ని దశల్లో ప్రతీ విభాగం ప్రభావితం అయినట్లు తెలిపారు. ఎక్కువగా యూఎస్ ఉద్యోగులు ప్రభావితం కానున్నట్లు వెల్లడించారు. తొలగించిన ఉద్యోగులకు పరిహారం అందించనుంది. యూఎస్ లో కోర్ బెనిఫిట్ కవరేజీతో 12 వారాల పెయిడ్ అడ్మినిస్ట్రేటివ్ లీవ్‌ను ఇవ్వనుంది.
Read Also: G20 Food Festival: టేస్ట్ ది వరల్డ్.. ఢిల్లీలో 2-రోజుల పాటు జీ20 ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్
ఆర్థికమాంద్యం పరిస్థితులు, ప్రపంచంలో వివిధ దేశాల్లో ద్రవ్యోల్భణం కారణంగా ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉన్నాయి టెక్ కంపెనీలు. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్, యాహూ, డెల్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. పెరుగుతున్న ఖర్చులను అదుపుచేసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీలు వెల్లడిస్తున్నాయి. 2023లో 336 కంటె ఎక్కువ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా రెండు నెలల్లోనే 1 లక్ష మంది టెక్ ఉద్యోగులను తొలగించించాయి. గతేడాది నవంబర్ నవంబర్ నుంచి ఒక్క యూస్ లోనే 2 లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారు. అయితే తొలగించబడిన ఉద్యోగుల్లో 30-40 శాతం భారతీయ ఐటీ నిపుణులు ఉన్నారు.
ఆర్థికమాంద్యాన్ని బూచిగా చూపిస్తూ అగ్రగామి టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. అమెజాన్ 18,000 మందిని, మెటా 11,000, గూగుల్ 12,000, మెక్రోసాఫ్ట్ 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగిస్తాయనే వార్తలు ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. దేశీయ ఐటీ కంపెనీ విప్రో కూడా ఇటీవల ఫ్రెషర్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందా అనే భయం ఐటీ ఉద్యోగుల్లో ఉంది.