Amazon: ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక మందగమన పరిస్థితులు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ముఖ్యంగా టెక్ రంగంలో ఉద్యోగులకు భద్రత లేకుండా పోయింది. గతేడాది నుంచి ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.
Google Layoff: ఆర్థిక మందగమనం, ఆర్థికమంద్యం భయాలు టెక్ కంపెనీల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఆదాయాలు తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారు. గతేడాది నవంబర్ నుంచి టెక్ సంస్థల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలైన గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ ఇలా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు స్వస్తి పలికాయి. అయితే ఈ లేఫ్స్ పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఐటీ రంగంలో కోవిడ్-19, ఆర్థిక మాంద్యం పరిస్థితులు గందరగోళానికి కారణం అవుతున్నాయి. ఇప్పటికే పలు స్టార్టప్ కంపెనీలు మూతపడ్డాయి. కొన్ని కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చినా, జాయినింగ్ లెటర్లు ఇవ్వడానికి సతమతం అవుతున్నాయి. ఒక వేళ ఆఫర్ లెటర్లు ఇచ్చినా, కంపెనీ ప్రాజెక్టుల్లో పనిచేయించుకోవడం లేదు.
Meta Layoff: ఐటీ ఉద్యోగుల పరిస్థితి దినదిన గండంగా ఉంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు పోతాయో తెలియడం లేదు. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు అయిన మెటా, గూగుల్, అమెజాన్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు వేల
Meta Layoffs: ఫేస్‌బుక్, ఇస్టాగ్రామ్ మాతృసంస్థ మెటా తన మూడో రౌండ్ ఉద్యోగుల తొలగింపులను ప్రారంభించింది. ఇప్పటికే రెండు విడతల్లో వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. ఇన్‌స్టాగ్రామ్ లో క్రియేటర్ మార్కెటింగ్‌గా పనిచేస్తున్న ఒక ఉద్యోగిని కూడా కంపెనీ తొలగించింది.
IT companies: ఆర్థికమాంద్య భయాలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమనం పరిస్థితులు ఐటీ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతున్నాయి. స్టార్టప్స్ నుంచి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ట్విట్టర్, అమెజాన్ వంటి కంపెనీలు వేలల్లో తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ఇచ్చాయి.
Meta Layoffs: అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, ఆర్థికమాంద్యం భయాలు టెక్ కంపెనీలను వణికిస్తున్నాయి. ఇప్పటికే మెటా, అమెజాన్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు వేలల్లో ఉద్యోగులను తొలగించాయి. ఆదాయం తగ్గిన నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మెటా తన ఆర్థిక పనితీరును మెరుగుపరుచుకోవడానికి, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించే ప్రయత్నంలో 2023ని ‘‘ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీ’’గా ప్రకటించింది.
Recession: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆర్థికవేత్తలు ఈ ఏడాది ఆర్థికమాంద్యం తప్పదని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరోపియన్ దేశాలు కూడా ఆర్థికమాంద్యాన్ని ఏదుర్కొవాల్సిందే అని చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా ఫెడరల్ బ్యాంక్ ద్రవ్యోల్భణం, ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు వడ్డీరేట్లను పెంచుతోంది. ఇక బ్రిటన్ వ్యాప్తంగా నిత్యావసరాల ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ట్రెజరీ మాంద్యం గురించి హెచ్చరించింది.
Amazon Layoff: అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, ఆర్థిక మాంద్యం భయాలు ఐటీ ఇండస్ట్రీతో పాటు సర్వీస్ సెక్టార్ ని భయపెడుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ ఐటీ కంపెనీలు వేలల్లో ఉద్యోగుల్ని తొలగించింది. గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ ఇలా అనేక కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.