నవమాసాలు మోసిన తల్లికి బిడ్డలు భారం అవుతున్నారు. కంటికి రెప్పలా కాడాపాల్సిన తండ్రి పిల్లల పోషణ భారం అవుతుందని అంగట్లో సరుకులా అమ్మకానికి పెట్టేస్తున్నారు. వారం వ్యవధిలో ఇద్దరు తల్లులు తమ పిల్లలను 2 లక్షలకు విక్రయించారు. డబ్బుల పంపకాల్లో తేడాతో ఓ కేసు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కగా.. స్థానికుల సమాచారంతో మరో పసికందు విక్రయం వెలుగు చూసింది. ఈ రెండు కేసుల్లో 9 మందిని అరెస్ట్ చేశారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. నిజామాబాద్ జిల్లాలో…
ఒకప్పుడు ఆడపిల్లలు పద్నాలుగు పదిహేను ఏళ్ళకి మెచ్యూర్ అయితే ఇప్పుడు పన్నెండు పదమూడు ఏళ్ళకే అవుతున్నారు. ఈ మార్పును మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. ఇంత చిన్నప్పుడే మెచ్యూర్ అవ్వడం ఎమోషనల్‌గా ఇబ్బంది పెడుతుంది. తరువాత కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అలాగని కొంత మంది పద్నాలుగేళ్ళకి కూడా మెచ్యూర్ అవ్వకపోతే మాత్రం ఆందోళన చెందవలసిన విషయమే. డాక్టర్‌ని కన్సల్ట్ చేసి కారణం ఏమిటో తెలుసుకోవాలి. అలాగే, ఎనిమిదేళ్ళకి ముందే మెచ్యూర్ అయినా కూడా ఖంగారు పడే…
డబ్బులు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.. అయితే, ఈజీగా డబ్బులు సంపాదించడం.. జల్సాలు చేయడానికి అలవాటు పడి.. కొందరు తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు.. అందులో భాగంగా మాయమాటలు చెప్పేవాళ్లు... అమ్మాయిలను ట్రాప్ చేసి ముగ్గులోకి దింపేవారు... అమ్మాయిల న్యూడ్ వీడియోలను బ్యాన్ చేసిన పోర్న్ వెబ్ సైట్లకు అమ్ముకుంటూ లక్షలకు లక్షలు సంపాదించేవారు... ఇలాంటి ఓ దుర్మార్గపు గ్యాంగ్ ఆట కట్టించారు సైబర్ సెక్యూరిటీ పోలీసులు.
Marriage : అవును.. ఇప్పుడు అబ్బాయిలకు పిల్ల దొరుకుతలేదు. పెళ్లి చేసుకుందామని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నా సరే.. అమ్మాయి దొరక్క పెళ్లికాని ప్రసాదుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఎంత చదువుకున్నా.. ఎంత పెద్ద జాబ్ చేస్తున్నా సరే పిల్ల దొరక్క సింగిల్ ఉండిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా రేషియో సమానంగా లేదు. అమ్మాయిల సంఖ్య కంటే అబ్బాయిల సంఖ్యనే ఎక్కువగా ఉండటంతో పిల్ల దొరకడం కష్టంగా మారిపోయింది. పైగా…
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సైబర్ దుండగులు వివిధ మార్గాల్లో ప్రజలను ట్రాప్ చేస్తున్నారు. మౌయిమా ప్రాంతంలో కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఫేస్‌బుక్‌లో ఒక వినియోగదారు.. ధనిక కుటుంబాలకు చెందిన అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తే రూ. 5 లక్షల జీతంతో ఉద్యోగం ఇస్తానని తెలిపాడు. ఈ ఆఫర్ చూసి ఓ యువకుడు ట్రాప్‌లో పడ్డాడు.
బెంగళూరు ఉమెన్స్ కాలేజీ వాష్‌రూమ్‌లో మొబైల్ కలకలం సృష్టించింది. కుంబల్‌గోడులోని ఏసీఎస్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల వాష్‌రూమ్‌లో అమ్మాయిల దృశ్యాలను 21 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి మొబైల్‌లో షూట్ చేశాడు. దీన్ని గమనించిన సహా విద్యార్థులు.. నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
మహారాష్ట్రలోని బద్లాపూర్ పాఠశాలలో ఇద్దరు బాలికలపై స్వీపర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆగస్టు 13న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య బాలికలపై స్వీపర్ లైంగిక దాడి చేశాడు. కాగా.. ఈ ఘటనపై ఆ బాలికలు తమ కుటుంబ సభ్యులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో.. బాధిత బాలికల కుటుంబ సభ్యులు ఆగస్టు 16న పోలీసులకు విషయం చెప్పారు. అనంతరం..…
ఉత్తరాఖండ్లోని రుద్రాపూర్‌లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మదర్సాలో మతగురువు (మౌల్వీ) దారుణానికి ఒడి గట్టాడు. ఐదుగురు బాలికలకు పోర్న్ వీడియోలు చూపిస్తూ శారీరక దోపిడీకి పాల్పడ్డాడు. మౌల్వీ చేసిన ఈ నీచమైన చర్యను ఐదుగురు బాలికలు బయటపెట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో వారే కాకుండా.. ఇతర అమ్మాయిలతో కూడా అసభ్యంగా ప్రవర్తించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇతర బాలికల నుంచి కూడా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.
ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం మహిళల కోసం కొత్త చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం.. బురఖా ధరించడం, బహిరంగ ప్రదేశాలకు వెళ్లడంపై కొత్త ఆంక్షలు విధించారు. ఈ చట్టాలకు తాలిబాన్ అగ్రనేత హిబతుల్లా అఖుంద్‌జాదా ఆమోదం తెలిపారు.