Marriage : అవును.. ఇప్పుడు అబ్బాయిలకు పిల్ల దొరుకుతలేదు. పెళ్లి చేసుకుందామని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నా సరే.. అమ్మాయి దొరక్క పెళ్లికాని ప్రసాదుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఎంత చదువుకున్నా.. ఎంత పెద్ద జాబ్ చేస్తున్నా సరే పిల్ల దొరక్క సింగిల్ ఉండిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా రేషియో సమానంగా లేదు. అమ్మాయిల సంఖ్య కంటే అబ్బాయిల సంఖ్యనే ఎక్కువగా ఉండటంతో పిల్ల దొరకడం కష్టంగా మారిపోయింది. పైగా ఇప్పుడు అమ్మాయిలు కూడా చదువుకుని సెటిల్ అయ్యేదాకా పెళ్లి చేసుకోబోమని తెగేసి చెప్పేస్తున్నారు. అబ్బాయిలు పెళ్లి చేసుకుందాం అనే సరికి.. తమకంటే ఐదు లేదా అంతకంటే తక్కువ వయసున్న అమ్మాయిలే ఆప్షన్ గా ఉంటున్నారు.
Read Also : Tollywood : హీట్ పుట్టించేందుకు ప్రిపేరవుతున్న హీరోయిన్స్
కానీ ఆ అమ్మాయిలు మాత్రం తాము సెటిల్ అయ్యేదాకా చేసుకునేది లేదని.. దాంతో పాటు అబ్బాయిలకు రకరకాల కండీషన్లు పెట్టేస్తున్నారు. ఒకప్పుడు చదువుకుని చిన్న జాబ్ చేసినా సరే అమ్మాయిలను ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఆస్తులు భారీగా ఉండాలి. దానికి తోడు మంచి జాబ్ ఉండి లక్షల్లో ప్యాకేజీలు ఉండాలనే కండీషన్లు అమ్మాయిల నుంచి పెరుగుతున్నాయి. అమ్మాయిలు కోరుకున్నవన్నీ అబ్బాయిల్లో ఉండకపోవడంతో అబ్బాయిలకు ఇబ్బందిగా మారింది. పైగా కులం అనేది ప్రధాన సమస్య. అగ్ర కులాల్లో అబ్బాయిలకు అమ్మాయిలు దొరక్క.. వేరే కులం వాళ్లను చేసుకుందామన్నా కుదరట్లేదు. అమ్మాయిల తల్లిదండ్రులు కూడా తమ కులం వాళ్లకే ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో అమ్మాయిల కొరత ఏర్పడుతోంది.
పైగా వరకట్నం ఇంకో సమస్య. అబ్బాయిల తల్లిదండ్రులు సొసైటీలో కట్నం తీసుకోవడం ప్రెస్టేజీగా భావిస్తున్నారు. దాంతో వారికి తగిన కట్నం ఇచ్చే అమ్మాయిలు దొరక్క అబ్బాయిలు పెళ్లి కాని ప్రసాదుల్లా మిగిలిపోతున్నారు. చిన్న ఉద్యోగాలు చేసుకునే వారికి, ఊర్లలో వ్యవసాయ పనులు చేసుకునే వారికి అయితే అసలు పిల్లను ఇవ్వడానికే ముందుకు రావట్లేదు. లక్షల్లో జీతం ఉంటేనే ఓకే అంటున్నారు. అబ్బాయిల కుటుంబం ఎలాంటిది, అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఎలాంటి వాడు, ఎలాంటి అలవాట్లు ఉన్నాయి.. ఇలా అన్నీ తెలుసుకుని ఓకే అనుకుంటేనే పెళ్లి చేసుకుంటున్నారు అమ్మాయిలు.
అమ్మాయిలు కోరుకున్న లక్షణాలు అన్నీ ఒక అబ్బాయిలో ఉండటం అంటే కష్టమే కదా. ఏవో కొన్ని క్వాలిటీస్ ఉన్నా సరే అమ్మాయిలు రిజెక్ట్ చేసేస్తున్నారు. పైగా అమ్మాయిలు మేనరికం సబంధాలు కూడా చేసుకోవట్లేదు. బయటి వారినే చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలా అమ్మాయిల కొరతతో పాటు.. అటు అబ్బాయిల కుటంబం పెట్టే కండీషన్లు, ఇటు అమ్మాయి కుటుంబం పెట్టే కండీషన్లు మ్యాచ్ కాక పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మన తెలుగు రాష్ట్రాల్లో 35 ఏళ్లు వచ్చినా పెళ్లి కాని వారు లక్షల్లో ఉన్నారంటే.. ఈ సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.