Badlapur Incident: బద్లాపూర్ ఘటనకు సంబంధించి పాఠశాలలో సీసీటీవీ ఫుటేజీ మిస్సింగ్..
- సంచలనంగా మారిన బద్లాపూర్ ఘటన
- బద్లాపూర్ పాఠశాలలో గత 15 రోజులుగా సీసీటీవీ ఫుటేజీ కనిపించడం లేదు- విద్యాశాఖ మంత్రి
- పాఠశాల అధికారుల ప్రమేయంపై అధికారులు దర్యాప్తు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని బద్లాపూర్ పాఠశాలలో ఇద్దరు బాలికలపై స్వీపర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆగస్టు 13న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య బాలికలపై స్వీపర్ లైంగిక దాడి చేశాడు. కాగా.. ఈ ఘటనపై ఆ బాలికలు తమ కుటుంబ సభ్యులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో.. బాధిత బాలికల కుటుంబ సభ్యులు ఆగస్టు 16న పోలీసులకు విషయం చెప్పారు. అనంతరం.. బాలికలిద్దరికీ వైద్యపరీక్షలు చేయించడంతో నిజం బయటకు వచ్చింది.
Read Also: JK Elections: జమ్మూ బీజేపీలో గందరగోళం.. తొలి జాబితాపై తీవ్ర అసంతృప్తి.. గంటల్లోనే సవరణ!
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
కాగా.. బద్లాపూర్ పాఠశాలలో గత 15 రోజులుగా సీసీటీవీ ఫుటేజీ కనిపించడం లేదని మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి దీపక్ కేసర్కర్ సోమవారం తెలిపారు. ఫుటేజీ ఎలా అదృశ్యమైంది.. పాఠశాల అధికారుల ప్రమేయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం బాధిత బాలికలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అత్యాచారం జరిగితే రూ.10 లక్షలు, లైంగిక వేధింపులకు గురైతే రూ.3 లక్షలు ఇస్తామని కేసర్కర్ తెలిపారు. అంతేకాకుండా.. ఆ ఇద్దరి చదువు ఖర్చులు తామే భరిస్తామని.. ఆడపిల్లలిద్దరికీ సాయం చేస్తామని మంత్రి చెప్పారు.
Read Also: Indigo service: ఇండిగో ఎయిర్లైన్స్ టికెట్ బుకింగ్ పై టీమిండియా క్రికెటర్ అసంతృప్తి..
మరోవైపు.. ఈ ఘటనపై బద్లాపూర్‌లో భారీ నిరసనలు చేపట్టారు. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి రైలు సేవలకు అంతరాయం కలిగించారు. ఆ తర్వాత పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. నిందితుడు అక్షయ్ షిండేను పోలీసులు ఆగస్టు 17న అరెస్టు చేసి కస్టడీకి పంపారు. కాగా.. నిందితుడిని ఎలాంటి తనిఖీలు లేకుండానే పాఠశాల కాంట్రాక్టు వర్కర్‌గా నియమించారు. అతనికి పాఠశాలలోని అణువణువూ తెలుసు. అంతేకాకుండా.. నిందితుడు నేరస్థుడనే అనుమానాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?