World War-3: మూడో ప్రపంచ యుద్ధాన్ని రష్యానే ప్రారంభించే అవకాశం ఉందని జర్మనీ రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి వెలువడిన రహస్య పత్రాలు పేర్కొన్నాయి. ఈ సమాచారాన్ని బిల్డ్ వార్తా పత్రికలో ప్రచురితమైంది. జర్మనీ రష్యాకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి సిద్ధమవుతోందని, వచ్చే ఏడాది నాటో మిత్రదేశాలపై దాడి చేయడం ద్వారా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని విస్తరించగలదని, మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉందని వార్తాపత్రిక పేర్కొంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రెండేళ్లకు చేరుతున్న నేపథ్యంలో ఈ పత్రాలు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే రష్యా అధికారులు ఈ నివేదికపై స్పందించేందుకు నిరాకరించారు. ఇది నకిలీదని ఆరోపించారు. ఐరోపాలోని నాటో తూర్పు భాగాలపై రష్యా దాడికి సిద్ధమవుతోందని, ఇందులో సైబర్ అటాక్ కూడా ఉండొచ్చని నివేదిక ఆరోపించింది.
Read Also: Vivek Ramaswamy: ట్రంప్ అధ్యక్షుడు కావడానికి ఏదైనా చేస్తా.. భారత సంతతి నేత కీలక వ్యాఖ్యలు..
జర్మనీ డిఫెన్స్ వర్గాలను ఉటంకిస్తూ.. ‘అలయన్స్ డిఫెన్స్ 2024’ పేరుతో కొన్ని వారాల్లో పరిస్థితి తీవ్రమవుతుందని.. పదివేల మంది జర్మన్ సైనికుల్ని యుద్ధభూమికి పంపబడతారని నివేదిక పేర్కొనడం సంచలనంగా మారింది. వెస్ట్రన్ కంట్రీస్ నుంచి నిధులు తగ్గిపోతున్నందున, రష్యన్ దళాలు వసంత కాలంలో ఉక్రెయిన్ బలగాలపై దాడులు చేస్తాయని పేర్కొంది.
క్లాసిఫైడ్ డాక్యుమెంట్ల ప్రకారం.. సెప్టెంబర్ నెలలో ఈ ఘర్షణలు తీవ్రమవుతాయి, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పశ్చిర రష్యా, బెలారస్‌లో దాదాపుగా 50,000 మంది రష్యన్ దళాలతో పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు ప్రారంభిస్తాయని నివేదిక పేర్కొంది. రష్యా నాటో దేశాలపై పోలాండ్, లిథువేనియా మధ్య ఉన్న రష్యన్ భూభాగం అయిన కాలినిన్ గ్రాండ్‌కి దళాలను, మధ్యశ్రేని క్షిపణులనున సమీకరిస్తుంది. 2025 మే నాటికి నాటో, రష్యాకి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుందని నివేదిక పేర్కొంది. దీనిపై క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ని ప్రశ్నించగా.. దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించాడుని రష్యన్ వార్తా సంస్థ TASS వెల్లడించింది. ఇది నకిలీ వార్త అని చెప్పారు. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా ఈ నివేదికను కొట్టిపారేశారు.