గాజాలో మానవతా సాయం అందించేందుకు పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ ఇటలీ నుంచి నౌకలో బయల్దేరి వెళ్లింది. అయితే ఆమెను గాజాలో ఇజ్రాయెల్ దళాలు అడ్డుకున్నాయి.
గాజాలో మానవతా సాయం చేసేందుకు వెళ్తున్న పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ బృందాన్ని ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంది. ఫ్రీడమ్ ఫ్లొటిల్లా కూటమి అనే సంస్థ ఆధ్వర్యంలో గాజాకు వస్తున్న ఈ నౌకలో థన్‌బర్గ్, 12 మంది ఆందోళనకారులు ఉన్నారు.
దక్షిణ ఫ్రాన్స్‌లోని మార్సెయిల్స్ సమీపంలోని ఫోస్-సుర్-మెర్ ఓడరేవులోని డాక్ కార్మికులు బుల్లెట్లను వేగంగా పేల్చడానికి మెషిన్ గన్‌లలో ఉపయోగించే చిన్న మెటల్ లింక్‌లతో కూడిన 19 ప్యాలెట్‌లను ఇజ్రాయెల్ వైపు లోడ్ చేయడానికి నిరాకరించారు.
ఇజ్రాయెల్-గాజా మధ్య గత రెండేళ్ల నుంచి యుద్ధం సాగుతోంది. 2023, అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్ ప్రతీకారంగా గాజాపై దాడి చేస్తూనే ఉంది. హమాస్ అంతమే లక్ష్యంగా భీకరదాడులు చేస్తోంది.
గాజాలో ఆదివారం సహాయ పంపిణీ దగ్గర జరిగిన కాల్పుల్లో 31 మంది చనిపోయారు. పదుల కొద్దీ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆకలితో అలమటిస్తున్న ప్రజలను ఇజ్రాయెల్ ఊచకోత కోసిందంటూ హమాస్ తీవ్ర ఆరోపణలు చేసింది.
గాజాలోని సహాయ కేంద్రం దగ్గర జరిగిన కాల్పుల్లో 26 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోగా.. 80 మంది గాయపడ్డారు. ఆకలితో అలమిటిస్తున్న అమాయక ప్రజలను ఇజ్రాయెల్ ఊచకోత కోసిందని హమాస్ ఆరోపించింది. ఆ సహాయ కేంద్రాలు మానవతా సహాయ కేంద్రాలు కాదని.. సామూహిక ఊచకోతలు అని హమాస్ ఆరోపించింది.
ఇజ్రాయెల్‌పై మిత్ర దేశం ఫ్రాన్స్ స్వరం మారింది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గళం విప్పారు. గాజా పట్ల ఇజ్రాయెల్ తన వైఖరి మార్చుకోవాలని సూచించారు.
గాజాను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవాలని ఇజ్రాయెల్ యోచిస్తున్నట్లుగా బ్లూమ్‌బెర్గ్ ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. 75 శాతం గాజాను నియంత్రించాలని ఇజ్రాయెల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గాజాపై ఇజ్రాయెల్ మారణహోమం కొనసాగిస్తోంది. తాజాగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఐడీఎఫ్ దళాలు జరిపిన దాడుల్లో 60 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇజ్రాయెల్-గాజా మధ్య కొన్ని నెలలుగా యుద్ధం సాగుతోంది. హమాస్ అంతమే లక్ష్యంగా ఐడీఎఫ్ యుద్ధం చేస్తోంది. ఇప్పటికే గాజాను ఇజ్రాయెల్ సర్వనాశనం చేసింది. అయితే మధ్యలో అంతర్జాతీయ మధ్యవర్తుల కారణంగా బందీలు-ఖైదీల మార్పిడి జరిగింది.