Parle-G Biscuits: రూ.5 పార్లే-జీ బిస్కెట్.. గాజాలో ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..!
- గాజాలో తీవ్రస్థాయిలో కరవు
- రూ.5 పార్లే-జీ బిస్కెట్.. గాజాలో రూ.2,400 అమ్మకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్-గాజా మధ్య గత రెండేళ్ల నుంచి యుద్ధం సాగుతోంది. 2023, అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్ ప్రతీకారంగా గాజాపై దాడి చేస్తూనే ఉంది. హమాస్ అంతమే లక్ష్యంగా భీకరదాడులు చేస్తోంది. ఇప్పటికే వేలాది మంది చనిపోగా.. ఇంకొందరు తిండి లేక ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోతున్నారు. దాదాపుగా కొన్ని నెలలుగా గాజా సరిహద్దులు మూసేయడంతో నిత్యావసర వస్తువులు లోపలికి వెళ్లడం లేదు. దీంతో కరవు తీవ్ర స్థాయికి చేరింది. ఇక ఎక్కడైనా కిరాణా సామాగ్రి దొరికితే ధరలు ఆకాశాన్నంటాయి. చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పార్లే-జీ బిస్కెట్లు కూడా కొనలేని పరిస్థితికి వెళ్లిపోయాయి.
ఇది కూడా చదవండి: AP Government: ఏపీ సర్కార్ కసరత్తు.. ఇక, రేషన్ బదులు నగదు..!
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
గాజాలో ప్రస్తుతం రూ.5 ఇండియన్ బిస్కెట్ రూ.2,400కి అమ్ముడవుతోంది. అంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో వేరే చెప్పనక్కర్లేదు. ఈ బిస్కెట్లు దాదాపు 4,300 కి.మీ దూరంలో ఉన్న దేశం నుంచి ఎగుమతి అవుతుంది. భారతీయ గృహాల్లో ప్రధానంగా పిల్లలు టీ బ్రేకుల సమయంలో ఉపయోగిస్తుంటారు. పోషకాహారం ముడిపడి ఉండడంతో ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ధర తక్కువే కానీ.. గాజాలో కరవు కారణంగా 500 రెట్లు ఎక్కువగా అమ్ముడుపోతుంది.
ఇది కూడా చదవండి: PM Modi: చినాబ్ బ్రిడ్జి.. ఐక్యత.. సంకల్పానికి చిహ్నం
ఇటీవల గాజా నుంచి ఒక పోస్ట్ వైరల్ అయింది. పార్లే జీ బిస్కెట్లు 24 యూరోలకు (రూ.2,342) అమ్ముడుపోతున్నాయని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘చాలాసేపు వేచి ఉన్న తర్వాత నేను చివరకు ఈరోజు రవీఫ్‌కి ఇష్టమైన బిస్కెట్లు కొన్నాను. ధర 1.5 యూరోల నుంచి 24 యూరోలకు పెరిగినప్పటికీ.. రఫీఫ్‌కు ఇష్టమైన ట్రీట్‌ను నేను కాదనలేకపోయాను.’’ అని పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన భారతీయులు.. ఇండియాలో ఇంత చౌకైన బిస్కెట్లు.. గాజాలో అంత ధర పలకడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
పార్లే జీ బిస్కెట్ ఒక్కటే కాదు. అన్ని నిత్యావసర ధరలన్నీ ఇదే మాదిరిగా ఉన్నాయి. జూన్ 6, 2025 నాటికి ఉత్తర గాజా నుంచి వచ్చిన కొన్ని ముఖ్యమైన ధరలు ఇలా ఉన్నాయి.
కిలో చక్కెర: రూ. 4,914
లీటరు వంట నూనె: రూ. 4,177
కిలో బంగాళాదుంపలు: రూ. 1,965
కిలో ఉల్లిపాయలు: రూ. 4,423
కాఫీ కప్పు: రూ. 1,800
After a long wait, I finally got Ravif her favorite biscuits today. Even though the price jumped from €1.5 to over €24, I just couldn’t deny Rafif her favorite treat. pic.twitter.com/O1dbfWHVTF
— Mohammed jawad 🇵🇸 (@Mo7ammed_jawad6) June 1, 2025
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!