గాజా-ఇజ్రాయెల్ మధ్య మరోసారి యుద్ధం రాజుకుంది. కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ అంగీకరించకపోవడంతో ఇజ్రాయెల్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించింది. ఏడాదికిపైగా జరిపిన వైమానిక దాడుల్లో ఇప్పటికే గాజా సర్వనాశనం అయింది. తాజాగా జరిపిన దాడుల్లో అయితే భారీ స్థాయిలో ప్రాణ నష్టంతో పాటు ఆస్తులు ధ్వంసం అయ్యాయి.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. ఏడాదికి పైగా గాజాపై ఇజ్రాయెల్ భీకరమైన యుద్ధం సాగించింది. అయితే జనవరి 19న అంతర్జాతీయ మధ్యవర్తుల చర్చలతో కాల్పుల విరమణకు ఒప్పందం జరిగింది. ఈ సమయంలో ఖైదీ-బందీల మార్పిడి జరిగింది. ఇటీవల ఈ ఒప్పందం గడువు ముగిసింది.
Gaza: పాలస్తీనియన్లను గాజా నుంచి తరిమేసేందుకు ఇజ్రాయిల్, అమెరికా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆఫ్రికా దేశాలను సంప్రదిస్తున్నట్లు సమాచారం. మూడు ఆఫ్రికా దేశాల్లో వీరికి పునరావాసం కల్పించడానికి చర్చిస్తున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ యూఎస్, ఇజ్రాయిల్ అధికారుల్ని ఉటంకిస్తూ నివేదించింది. ఈ ప్రతిపాదనకు సంబంధించి సుడాన్, సోమాలియా, సోమాలిలాండ్‌తో ఈ ప్రతిపాదన గురించి చర్చిస్తున్నారు.
గాజాలో హమాస్ చెరలో బందీలుగా ఉన్న అమెరికా పౌరుల కోసం వైట్‌హౌస్ రహస్యంగా చర్యలు జరిపినట్లు తెలుస్తోంది. అమెరికన్ బందీలను విడుదల చేయాలని హమాస్‌ను అమెరికా అధికారులు కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌కు సమాచారం ఇవ్వకుండానే.. ఈ చర్చలు జరిపినట్లుగా సమాచారం.
Bomb Blast: ఆగి ఉన్న మూడు బస్సులలో వరుస పేలుళ్లు సంభవించడంతో సెంట్రల్ ఇజ్రాయెల్ దద్దరిల్లింది. ఇది ఉగ్రవాద దాడిగా అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి ఎవరూ గాయపడినట్లు, మరణించినట్లుగాను నివేదిక లేదు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ గాజా నుండి నలుగురు బందీల మృతదేహాలను తిరిగి ఇచ్చిన తర్వాత ఇజ్రాయెల్ ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఇవే కాకుండా మరో రెండు బస్సుల్లో పేలుడు పదార్థాలు దొరికాయని, కానీ.. అవి పేలలేదని…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హమాస్‌కు ఇచ్చిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలలోపు ఇజ్రాయెల్ బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని హమాస్‌కు ట్రంప్ అల్టిమేటం విధించారు.
పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండం అయ్యేలా కనిపిస్తోంది. ఏడాదికి పైగా ఇజ్రాయెల్ చేసిన దాడులతో గాజా నేలమట్టం అయింది. వందలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
Gaza: ఇటీవల డొనాల్డ్ ట్రంప్ గాజాపై చేసిన ప్రకటన సంచలనంగా మారింది. గాజాలోని పాలస్తీనియన్లను ఇతర అరబ్ దేశాలు తీసుకోవాలని సూచించారు. పాలస్తీనియన్లకు జోర్డాన్, ఈజిప్ట్ దేశాలు ఆశ్రయం కల్పించాలని లేదంటే సాయం నిలిపేస్తామని ట్రంప్ హెచ్చరించారు. పాలస్తీనియన్లు ఖాళీ చేసిన తర్వాతే గాజాని స్వాధీనం చేసుకుంటామని, అప్పుడు మాత్రమే గాజా పునర్ నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు. గాజాపై తన ప్రతిపాదన గురించి జోర్డాన్ రాజుతో మాట్లాడినట్లు ట్రంప్ చెప్పారు. అయితే, ఈ ప్రతిపాదనని జోర్డాన్ తోసిపుచ్చింది.…
గాజాను స్వాధీనం చేసుకుని తీరుతామని మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. తాజా పరిణామాలపై జోర్దాన్ రాజు అబ్దుల్లాతో ట్రంప్ చర్చించారు. గాజాను కొనాల్సిన అవసరం లేదని.. దానిని స్వాధీనం చేసుకుని తీరుతామని ట్రంప్ వెల్లడించారు.
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హమాస్-లెబనాన్-ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరిగింది.