గాజాలో మానవతా సాయం అందించేందుకు పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ ఇటలీ నుంచి నౌకలో బయల్దేరి వెళ్లింది. అయితే ఆమెను గాజాలో ఇజ్రాయెల్ దళాలు అడ్డుకున్నాయి. దీంతో ఆమె.. ఇజ్రాయెల్ దళాలు కిడ్నాప్ చేశాయంటూ సోషల్ మీడియాలో ఆరోపించారు. ఆమె యూదు ద్రోహి అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Raghurama Krishna Raju: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. సజ్జలపై డీజీపీకి డిప్యూటీ స్పీకర్ ఫిర్యాదు..!
తాజాగా గ్రెటా థన్‌బర్గ్ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఆమె ఒక వింత మనిషి అని.. ఆమె కోపం నిజమైందో కాదో తెలియదు గానీ.. ఆమెకు కోపం తగ్గాలంటే ప్రత్యేకమైన తరగతులకు పంపించాలని సూచించారు. కోపానికి సంబంధించిన కోచింగ్ సెంటర్ ఉంటే దానికి పంపించాలని తెలిపారు. ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యానికి అనేకమైన సమస్యలు ఉన్నాయని.. కొత్తగా ఈ తలనొప్పి ఎందుకు అని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Harish Rao : హైకోర్టులో హరీష్ రావుకు ఊరట.. ఎన్నికల పిటిషన్ కొట్టివేత
పాలస్తీనాకు అనుకూలంగా గ్రెటా థన్‌బర్గ్ ఒక స్వచ్ఛంద సంస్థ ఫ్రీడమ్ ఫ్లొటిల్లా అలెయన్స్‌ను స్థాపించింది. యూరోపియన్ పార్లమెంట్ మెంబర్ రీమా హసన్‌తో కలిసి మొత్తం 12 మందితో కూడిన బృందం మడ్లీన్ నౌకలో గాజాకు బయల్దేరారు. వివిధమైన ఆహార వస్తువులు తీసుకుని బయల్దేరారు. అయితే సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ ఆర్మీ అంతర్జాతీయ జలాల్లో నౌకను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో తమను ఐడీఎఫ్ కిడ్నాప్ చేసిందంటూ థన్‌బర్గ్ ఆరోపించింది.
2023, అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి బందీలుగా తీసుకెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్.. హమాస్ అంతమే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇప్పటికే గాజా నాశనం అయింది. అయితే చాలా నెలలుగా గాజా సరిహద్దులు మూసేయడంతో ఆహార పదార్థాలు లభించక ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో అంతర్జాతీయంగా ఒత్తిడి రావడంతో రెండు వారాలుగా గాజా సరిహద్దులను ఇజ్రాయెల్ తెరిచింది. దీంతో స్వచ్ఛంద సంస్థలు ఆహారం పంపిణీ చేస్తున్నాయి. ఆ విధంగానే థన్‌బర్గ్ బృందం బయల్దేరింది. అయితే ఆమె పాలస్తీనా అనుకూలంగా ఉండడంతో అడ్డుకున్నారు.