గాజాను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవాలని ఇజ్రాయెల్ యోచిస్తున్నట్లుగా బ్లూమ్‌బెర్గ్ ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. 75 శాతం గాజాను నియంత్రించాలని ఇజ్రాయెల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గాజావాసులకు 3 ప్రాంతాలకు తరలించాలని ప్లాన్ చేస్తోంది. 2 నెలల్లో ఈ ప్లాన్‌ను పూర్తిగా అమలు చేయాలని భావిస్తోంది.
ఇది కూడా చదవండి: MLC Kavitha: కేటీఆర్కు ఏసీబీ నోటీసులపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత..
హమాస్ బందీలను విడుదల చేయకపోవడంతో గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ దాడులను ఉధృతం చేసింది. అయితే గాజాను ఆధీనంలోకి తీసుకోవాలన్న ఆలోచనతో 2 మిలియన్ల గాజా వాసులను మూడు ప్రాంతాలకు తరలించాలని ప్రణాళిక రచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) గాజాలో ‘గిడియాన్స్ చారియట్స్’ అనే కొత్త ప్రధాన సైనిక ఆపరేషన్‌ను ప్రారంభించింది.
ఇది కూడా చదవండి: Manoj : మనోజ్ కు ఏం తక్కువైంది.. విలన్ గా ఎందుకు మారాడు..?
గాజా యుద్ధాన్ని త్వరగా ముగించాలని ఇజ్రాయెల్‌పై అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో గాజాను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవాలని ఐడీఎఫ్ భావిస్తోంది. ఇక మానవతా దృక్పథంతో గాజాలో అమెరికా సహాయ పంపిణీ కార్యక్రమం చేస్తోంది. ఆకలి చావులు నియంత్రించేందుకు అమెరికా ఈ ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు బందీలను విడుదల చేయడానికి ఖతార్, ఈజిప్ట్, యునైటెడ్ స్టేట్స్ చేసిన దౌత్య ప్రయత్నాలు ఇప్పటివరకు విఫలమయ్యాయి.
అక్టోబర్ 7, 2023న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి బందీలుగా తీసుకెళ్లిపోయారు. దీంతో హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. గాజాను పూర్తిగా నాశనం చేసింది. ఇప్పుడు గాజాను పూర్తిగా ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకునేందుకు కసరత్తు చేస్తోంది.