Israel-Hamas: ఇజ్రాయెల్ తన దాడులను తీవ్రతరం చేయడంతో గాజా ప్రాంతంలో గురువారం ఒక్క రోజులోనే 80 మంది పౌరులు మృతి చెందారు. వీరిలో చాలా మంది మహిళలు, పిల్లలు ఉన్నారని పాలస్తీనా వైద్య వర్గాలు వెల్లడించాయి. ఖాన్ యూనిస్‌లోని నాసర్ ఆసుపత్రి ప్రకారం, ఆ నగరంపై జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 54 మంది మరణించారు. దాడుల్లో తీవ్రంగా గాయపడిన వారు అనేకమంది ఉన్నారు. అలాగే గాజా నగరం, ఉత్తర గాజా ప్రాంతాల్లో జరిగిన ఇతర వైమానిక…
Israel-Hamas Conflict: ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య ఉద్రిక్తతలతో పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారుతుంది. తాజాగా ఉత్తర గాజాలోని ఇళ్లపై మంగళవారం రాత్రి వైమానిక దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్.
హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా మరింత తీవ్రమైంది. గత 48 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 90 మందికి పైగా మృతిచెందారు. ఈ మేరకు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.
Microsoft: మైక్రోసాఫ్ట్ బాస్‌లపై భారత సంతతికి చెందిన ఒక ఇంజనీర్ ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గాజాలో మారణహోమానికి ఇజ్రాయిల్‌కి సాంకేతిక సహాయం చేశారని వానియా అగర్వాల్ అనే టెక్కీ ప్రశ్నించింది. ఇజ్రాయిల్ సైనిక చర్యలలో మైక్రోసాఫ్ట్ భాగస్వామి అని ఆమె ఆరోపించింది. మైక్రోసాఫ్ట్ బాస్‌లు సత్య నాదెళ్ల, స్టీవ్ బాల్మెర్, బిల్ గేట్స్ ముగ్గురూ ఉన్న సమయంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగి ఆగ్రహంలో వీరంతా ఒకింత…
గాజాలో మరోసారి ఇజ్రాయెల్ దళాలు సైనిక ఆపరేషన్ మొదలు పెట్టాయి. బుధవారం భారీ స్థాయిలో ఐడీఎఫ్ దళాలు మోహరించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ తెలిపారు. హమాస్‌ను నిర్మూలించి.. బందీలను తిరిగి తీసుకొస్తామని చెప్పారు. అందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
పాలస్తీనియన్ ఉగ్రవాద సంస్థ హమాస్ సొంత ప్రజల పైనే తన కోపాన్ని చూపిస్తోంది. ఇటీవల గాజా స్ట్రిప్‌లోని ప్రజలు హమాస్‌కి వ్యతిరేకంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ‘‘హమాస్ అవుట్’’ అంటూ నినదించారు. అయితే, ఈ పరిణామాలు హమాస్ ఉగ్ర సంస్థకు నచ్చలేదు. దీంతో సొంత ప్రజలనే ఉరితీసి చంపేస్తోంది. హమాస్ ఇప్పటి వరకు కనీసం ఆరుగురు గాజా ప్రజల్ని ఉరితీసినట్లు తెలుస్తోంది. కొందరిని కిడ్నాప్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నివేదికల ప్రకారం, చాలా మందికి బహిరంగంగా…
Gaza: ఇన్నాళ్లు యుద్ధంలో సర్వం కోల్పోయిన గాజా ప్రజలు తీవ్ర ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తమ పరిస్థితికి ‘‘హమాస్’’ ఉగ్రవాదులే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు గాజా ప్రజల కోసం ప్రజల కోసమే తాము పోరాడుతున్నామని చెప్పుకుంటున్న హమాస్‌కి అక్కడి ప్రజల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బుధవారం వరసగా రెండో రోజు, గాజా స్ట్రిప్‌లోని వందలాది మంది పాలస్తీనియన్లు వీధుల్లోకి వచ్చి హమాస్‌కి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. Read Also: Disha Salian Case:…
గాజాలో హమాస్‌కు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబావుటా ఎగరేశారు. పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన ర్యాలీలు చేపట్టారు. హమాస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘హమాస్ అవుట్’ అంటూ నినాదాలు చేశారు. ఈ ఆందోళనల్లో పెద్ద ఎత్తున పురుషులు పాల్గొన్నారు. ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో ఈ నిరసన ర్యాలీలు చేపట్టారు. తక్షణమే యుద్ధం ముగించాలని.. హమాస్ అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు.
హమాస్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. తొలి విడత ఒప్పందం ముగిశాక.. సోమవారం ఇజ్రాయెల్ భీకరదాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో దాదాపు 400 మందికిపైగా చనిపోయారు. ఇందులో హమాస్ కీలక నేతలంతా ఉన్నారు. ఇక తాజాగా మరోసారి హమాస్‌కు చివరి హెచ్చరిక జారీ చేసింది.