ట్రంప్ ప్రణాళికను అంగీకరిస్తున్నట్లు హమాస్ ప్రకటించింది. బందీలందరినీ ఒకేసారి విడుదల చేస్తామని వెల్లడించింది. దీంతో గాజాలో శాంతికి పునాది పడినట్లైంది. అయితే తాజాగా హమాస్‌కు ఇజ్రాయెల్ కీలక సూచన చేసింది. తక్షణమే బందీలను విడుదల చేయాలని కోరింది. అలాగే పాలస్తీనా ఖైదీలను కూడా విడుదల చేస్తున్నట్లు తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. గాజాలో శాంతి స్థాపనకు పురోగతి సాధించారంటూ ట్రంప్‌ను మోడీ అభినందించారు. ఈ మేరకు ఎక్స్‌లో మోడీ పోస్ట్ చేశారు. శాశ్వత, న్యాయమైన శాంతి కోసం చేసే ప్రయత్నాలకు భారతదేశం ఎప్పుడూ గట్టిగా మద్దతు ఇస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.
ట్రంప్ ప్లాన్‌పై హమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే నరకం చూస్తారని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఎట్టకేలకు హమాస్ దిగొచ్చింది. ట్రంప్ ప్రణాళికకు అంగీకారం తెలిపింది.
హమాస్ ఉగ్రవాదులకు ట్రంప్ కొత్త డెడ్‌లైన్ విధించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు శాంతి ఒప్పందానికి రావాలని కోరారు. లేదంటే సాయంత్రం 6 గంటల తర్వాత నరకం చూస్తారని హెచ్చరించారు.
గాజాలో శాంతి ఒప్పందానికి ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రణాళికను హమాస్ ఉగ్రవాదులకు అందజేశారు. ఈ ప్రణాళిక అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హమాస్‌ను ట్రంప్ హెచ్చరించారు.
Israel-Hamas War: అక్టోబర్ 07 నాటి దాడుల తర్వాత నుంచి ఇజ్రాయిల్ పాలస్తీనాపై విరుచుకుపడుతోంది. ముఖ్యంగా గాజా స్ట్రిప్‌లో హమాస్‌ను తుడిచిపెట్టేందుకు విస్తృత దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటికే హమాస్ అగ్రనాయకత్వాన్ని ఇజ్రాయిల్ అంతం చేసింది. కానీ, మరికొంత మంది ఇజ్రాయిలీ బందీలు ఇంకా హమాస్ చెరలోనే ఉన్నారు. ఇటీవల, గాజాలో శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు గాజా పీస్ ప్లాన్ ప్రకటించారు. అయితే, మరోవైపు గాజా సిటీని వదిలి వెళ్లాలని ఇజ్రాయిల్ బుధవారం తుది హెచ్చరికలు జారీ…
గాజా స్వాధీనం.. బందీలను రక్షించడం లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. తాజా దాడుల్లో ఇప్పటి వరకు 41 మంది మృతి చెందగా.. పదుల కొద్ది గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. ఇకపై పాలస్తీనా దేశంగా ఉండబోదని ప్రతిజ్ఞ చేశారు. ఖతార్‌లో హమాస్ నాయకుల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి తర్వాత అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
గాజాలో మానవతాసాయం అందించేందుకు 44 దేశాల పౌరులను తీసుకెళ్తున్న గ్రెటా థన్‌బర్గ్ నౌక్‌పై డ్రోన్ దాడి జరిగింది. ట్యునీషియా దగ్గర ఈ దాడి జరిగింది. పోర్చుగీస్ జెండా కలిగిన గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా నౌక అనుమానిత దాడిలో దెబ్బతిన్నట్లుగా అధికారులు పేర్కొన్నారు.
బందీలను వెంటనే విడుదల చేయాలని.. లేదంటే భారీ వినాశనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హమాస్‌కు ఇజ్రాయెల్ చివరి హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. తాజాగా అదే కోవలో ఇజ్రాయెల్ కూడా చివరి హెచ్చరిలు ప్రకటించింది.