Hezbollah Israel Tension: లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం విధ్వంసం సృష్టిస్తున్న తీరు హిజ్బుల్లా అంతం చాలా దగ్గర్లోనే ఉందన్న సందేశం వస్తుంది. హిజ్బుల్లా పరిస్థితి గాజాలోని హమాస్ పరిస్థితి కూడా అంతే.
Gaza War: హమాస్-ఇజ్రాయిల్ పోరు ఇప్పటిలో ముగిసేలా కనిపించడం లేదు. అక్టోబర్ 07తో యుద్ధం ప్రారంభమై ఏడాది గడుస్తోంది. అయితే, గతేడాది అక్టోబర్ 07 నాటి దాడి సమయంలో అపహరణకు గురైన ఇజ్రాయిలీ బందీల జాడ ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే, వారెక్కడ ఉన్నారనే వివరాలు ఇంకా తెలియవు. మరోవైపు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వారి కోసం గాజా వ్యాప్తంగా హమాస్ టన్నెల్స్, ఇతర భాగాల్లో క్షుణ్ణంగా వెతుకుతోంది.
Israel: ఇజ్రాయిల్ అత్యున్నత ఇంటెలిజెన్స్ ఎజెన్సీ ‘యూనిట్ 8200’ చీఫ్ రాజీనామా చేయనున్నట్లు ఆ దేశ సైన్యం గురువారం ప్రకటించింది. "8200 యూనిట్ కమాండర్, (బ్రిగేడియర్ జనరల్) యోస్సీ సారిల్, తన పదవినికి రాజీనామా చేయాలనే ఉద్దేశాన్ని తన కమాండర్లు మరియు సబార్డినేట్‌లకు తెలియజేసారు’’ అని ఇజ్రాయిల్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. రాబోయే రోజుల్లో ఆయన తన పదవిని ముగించనున్నట్లు పేర్కొంది.
ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్‌ని ఉద్దేశిస్తూ హమాస్ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాగే సైనిక ఒత్తిడి కొనసాగిస్తే బందీలను ‘‘శవపేటికల్లో పంపిస్తాము’’ అని చెప్పారు. హమాస్ సాయుధ విభాగం ఎజెడిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ ప్రతినిధి అబూ ఒబెయిడా ఒక ప్రకటనలో వార్నింగ్ ఇచ్చారు.
Israel-Hamas War: గాజాలో బందీగా ఉన్న ఆరుగురు ఇజ్రాయిలీలను హమాస్ కాల్చి చంపడం యుద్ధంలో కీలక పరిణామంగా మారింది. గాజాలోని దక్షిణ ప్రాంతమైన రఫాలోని భూగర్భ సొరంగాల్లో ఈ ఆరుగురు మృతదేహాలను ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) కనుక్కున్నాయి. బందీలు చనిపోవడంపై ఇజ్రాయిల్‌లో తీవ్ర నిరసనలకు దారి తీశాయి. ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ లక్ష్యంగా వేలాది మంది టెల్ అవీవ్‌లో నిరసనలు చేశారు. బందీల విడుదల ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Gaza War: దక్షిణ గాజాలోని రఫా ప్రాంతంలో హమాస్ సొరంగాల్లో ఆరుగురు ఇజ్రాయిలీ బందీల మృతదేహాలను ఇజ్రాయిల్ ఆర్మీ స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం తెలిపింది. చనిపోయిన బందీలను కార్మెల్ గాట్, ఈడెన్ యెరుషల్మి, హెర్ష్ గోల్డ్‌బెర్గ్-పోలిన్, అలెగ్జాండర్ లోబనోవ్, అల్మోగ్ సరుసి మరియు ఒరి డానినోగా గుర్తించారు. అక్టోబర్ 07నాటి హమాస్ దాడి సమయంలో వీరిని
Nobel Peace Prize : గాజా యుద్ధంలో భయంకరమైన పరిస్థితుల్లోనూ ఇజ్రాయెల్ సైన్యం చర్యలను, గాజా పౌరుల దయనీయ స్థితిని తమ జర్నలిజం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన గాజాకు చెందిన నలుగురు జర్నలిస్టులు ఈసారి నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు.
Yahya Sinwar: అక్టోబర్ 7 నాటి హమాస్ దాడి తర్వాత, ఇజ్రాయిల్ ఉగ్రసంస్థపై విరుచుకుపడుతోంది. ముఖ్యంగా గాజా ప్రాంతంలో ఒక్క హమాస్ కార్యకర్త లేకుండా వారిని హతం చేస్తోంది. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ దాడికి ఇప్పటికే హమాస్ దాదాపుగా కకావికలం అయింది. మరోవైపు అగ్రనేతల్ని ఇజ్రాయిల్ వెతికి వేటాడి మట్టుపెడుతోంది.
Israel Army Attack : హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత దాదాపు యుద్ధ రూపాన్ని సంతరించుకుంది. లెబనాన్ సరిహద్దుకు ఇరువైపులా వైమానిక దాడులు జరుగుతున్నాయి.