Iran Israel Tension: మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్ తారాస్థాయికి చేరుకుంది. ఇరాన్ , హిజ్బుల్లా నుండి బెదిరింపుల తరువాత, ఇజ్రాయెల్ ఎటువంటి దాడినైనా ఎదుర్కోవడానికి పూర్తి సన్నాహాలు చేసింది.
Hamas: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామం సంభవించింది. ఇన్నాళ్లు ప్రత్యర్థి గ్రూపులుగా ఉన్న హమాస్, పాలస్తీనాలోని ఇతర గ్రూపులు చేతులు కలిపాయి. పాలస్తీనా కోసం ‘జాతీయ ఐక్యత’ కోసం పాలస్తీనాలోని ప్రత్యర్థులతో హమాస్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
Israel: ఇజ్రాయిల్ గాజాపై విరుచుకుపడుతోంది. తాజాగా శనివారం గాజాలో హమాస్ మిలిటరీ చీఫ్ మహ్మద్ డీఫ్ లక్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడిలో కనీసం 71 మంది మరణించినట్లు గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Israel: ఇజ్రాయిల్-హమాస్ పోరు రోజురోజుకు తీవ్రమవుతోంది. అక్టోబర్ 7 నాటి హమాస్ దాడికి ప్రతీకారంగా హమాస్ మిలిటెంట్ సంస్థను పూర్తిగా నేలకూల్చే వరకు ఇజ్రాయిల్ విశ్రమించేలా కనిపించడం లేదు.
Israeli Air Strike: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేకి భారీ ఎదురుదెబ్బ తాకింది. గతేడాది నుంచి హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరుగుతోంది. అక్టోబర్ 07 నాటి హమాస్ దాడికి ప్రధాన సూత్రధారిగా హమాస్ నేత హనియే అని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది.
India-Israel: భారత్‌లో ఇజ్రాయిల్ రాయబారిగా పనిచేసిన మాజీ దౌత్యవేత్త డేనియల్ కార్మోన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాజాతో ఇజ్రాయిల్ సాగిస్తున్న యుద్ధంలో ఇజ్రాయిల్‌కి మద్దతుగా భారత్ ఆయుధాలను పంపుతోందని వ్యాఖ్యలు చేశారు.
Israel Strike : గాజాలో ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పటి నుండి, లెబనాన్ సరిహద్దు నుండి ఇజ్రాయెల్.. సైన్యంపై రాకెట్లతో నిరంతరం కాల్పులు జరుపుతూనే ఉన్నాయి.
Israel-Hamas War: హమాస్, ఇజ్రాయిల్‌పై అక్టోబర్ 07న చేసిన దాడి సామాన్య పాలెస్తీనియన్ల పాటిట విషాదంగా మారింది. హమాస్ గతేడాడి ఇజ్రాయిల్‌పై దాడి చేసింది. ఈ దాడిలో 1200 మంది ప్రజల్ని హతమార్చడంతో పాటు 240 మందిని హమాస్ కిడ్నాప్ చేసింది.
Israel:బందీలను అప్పగించే వరకు ఎలాంటి ఒప్పందం లేదన ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. యుద్ధం నిలిపేస్తే చర్చలకు సిద్ధమని హమాస్ ప్రకటించిన నేపథ్యంలో ఇజ్రాయిల్ ఈ వ్యాఖ్యలు చేసింది. బందీలను అప్పగించడం ఒప్పందంలో భాగం కాకుంటే గాజాలో పోరాటాన్ని ఆపేది లేని శుక్రవారం ఇజ్రాయిల్ సీనియర్ భద్రతా అధికారి చెప్పారు.