Hamas: గాజా యుద్ధం ముగిసే వరకు ఇజ్రాయిల్ బందీలు-ఖైదీల మార్పిడి ఒప్పందం ఉండదని హమాస్ యాక్టింగ్ గాజా చీఫ్ ఖలీల్ అల్ హయ్యా బుధవారం అల్ అక్సా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Isaral-Hamas War: ఇజ్రాయిల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది దాటింది. అక్టోబర్ 07 నాటి హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయిల్ గాజాలోని హమాస్‌పై విరుచుకుపడుతోంది. హమాస్ కీలక నేతల్ని ఒక్కొక్కరిగా మట్టుపెడుతోంది. ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మంగళవారం పాలస్తీనా ప్రాంతమైన గాజాలో పర్యటించారు. గాజా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆ ప్రాంతానికి నెతన్యాహూ వెల్లడం ఇదే మొదటిసారి.
హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ గతేడాది నుంచి యుద్ధం సాగిస్తోంది. ఇప్పటికే గాజాను ఇజ్రాయెల్ నేలమట్టం చేసింది. ప్రస్తుతం ఇంకా ఇజ్రాయెల్ దాడులు సాగిస్తోంది. తాజాగా ఇదే వ్యవహారంపై అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్‌కు కీలక సూచన చేశారు.
Gaza War : భారతదేశానికి కూడా పాలస్తీనాతో బలమైన సంబంధాలు ఉన్నాయి. క్లిష్ట సమయాల్లో పాలస్తీనాకు భారతదేశం ప్రతిసారీ తన సహాయ హస్తాన్ని అందించడానికి ఇదే కారణం.
Israel: ఇజ్రాయిల్-హమాస్ వార్ ప్రారంభమైనప్పటికీ నుంచి పలువురు జర్నలిస్టులు రిపోర్టింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే, ఆరుగురు ‘అల్ జజీరా’ జర్నలిస్టులకు పాలస్తీనా తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఇజ్రాయిల్ సైన్యం ఆరోపించింది.
Benjamin Netanyahu: ‘‘ఆడు మగడ్రా బుజ్జీ’’ తెలుగు సినిమాలోని ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఇప్పుడు ఆ డైలాగ్ ఫర్‌ఫెక్ట్‌గా సూటయ్యే వ్యక్తి ఎవరైనా ఉన్నారా..? అంటే అది ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ అని చెప్పవచ్చు.
Yahya Sinwar: ఇజ్రాయిల్‌పై అక్టోబర్ 07 నాటి దాడులకు ప్రధాన సూత్రధారి, దాడులకు ఆదేశాలు ఇచ్చిన హమాస్ నేత, ప్రస్తుతం ఆ సంస్థకు చీఫ్‌గా ఉన్న యాహ్యా సిన్వార్‌ని ఇజ్రాయిల్ హతమార్చింది. ఈ వార్త నిజమైతే హమాస్‌ని కూకటివేళ్లతో పెకిలించినట్లే.
Hamas: హమాస్ అక్టోబర్ 07, 2023 దాడికి ఏడాది ముందు నుంచే ప్లాన్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. దాడుల కోసం హమాస్ మిలిటరీ, పొలిటికల్ నాయకుడు దాదాపుగా రెండేళ్ల పాటు వరసగా సమావేశాలు నిర్వహించారు. గతేడాది అక్టోబర్ 07 నాటి దాడిలో హమాస్, దక్షిణ ఇజ్రాయిల్‌లోకి ప్రవేశించి 1200 మందిని చంపింది. 251 మందిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత నుంచి ఇజ్రాయిల్ హమాస్‌పై విరుచుకుపడుతోంది. గాజాలో దాడుల్లో ఇప్పటి వరకు 40…
Israel: అక్టోబర్ 07 నాటి హమాస్ దాడులకు ఏడాది అవుతున్న తరుణంలో ఇజ్రాయిల్ అప్రమత్తమైంది. అయితే, ఆదివారం రోజు దక్షిణ ఇజ్రాయిల్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పల్లో ఒకరు మరణించగా, 10 మంది గాయపడినట్లు ఇజ్రాయిల్ పోలీసులు తెలిపారు. దక్షిణ ఇజ్రాయిల్‌లోని బీర్ షెవాలో ఆదివారం కాల్పులు చోటు చేసుకున్నాయి.
Israel-Gaza War: అక్టోబర్ 07 నాటి దాడులకు రేపటితో ఏడాది పూర్తి అవుతున్న వేళ హమాస్ మరోసారి తన దురుద్దేశాన్ని ప్రకటించింది. గాజా నుంచి ఇజ్రాయిల్‌పైకి రాకెట్లను ప్రయోగించింది. ముఖ్యంగా దక్షిణ ఇజ్రాయిల్ ప్రాంతంపై రాకెట్లు ప్రవేశించాయి.