Israel-Hamas War: ఆరుగురు బందీలను తల వెనక కాల్చి చంపిన హమాస్: బెంజమిన్ నెతన్యాహూ..
- బందీలను తలలోకి కాల్చిచంపిన హమాస్..
- ఆరుగురి హత్యపై ఇజ్రాయిల్‌లో తీవ్ర నిరసనలు..
- తాను లొంగిపోయేది లేదన్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: గాజాలో బందీగా ఉన్న ఆరుగురు ఇజ్రాయిలీలను హమాస్ కాల్చి చంపడం యుద్ధంలో కీలక పరిణామంగా మారింది. గాజాలోని దక్షిణ ప్రాంతమైన రఫాలోని భూగర్భ సొరంగాల్లో ఈ ఆరుగురు మృతదేహాలను ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) కనుక్కున్నాయి. బందీలు చనిపోవడంపై ఇజ్రాయిల్‌లో తీవ్ర నిరసనలకు దారి తీశాయి. ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ లక్ష్యంగా వేలాది మంది టెల్ అవీవ్‌లో నిరసనలు చేశారు. బందీల విడుదల ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే, బందీల తల వెనక భాగంలో కాల్చి హమాస్ హత్య చేసిందిన నెతన్యాహూ సోమవారం చెప్పారు. ‘‘ఆ హంతకులు మా బందీలలో ఆరుగురిని కాల్చి చంపారు’’ అని అన్నారు. బందీలను అత్యంత సమీపంలో నుంచి కాల్చి చంపినట్లు ఇజ్రాయిల్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. బందీలను రక్షించలేకపోయినందుకు ఇజ్రాయిల్ ప్రధాని ప్రజల్ని క్షమాపణ కోరారు. ఐక్యత కోసం పిలుపునిచ్చారు.
Also Read
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
Read Also: Putin: అరెస్ట్ బెదిరింపులకు భయపడని పుతిన్.. మంగోలియాలో పర్యటన..
గతేడాది అక్టోబర్ 07 నాడు ఇజ్రాయిల్‌పై హమాస్ దారుణమైన దాడికి పాల్పడింది. ఈ దాడిలో 1200 మందిని ఊచకోత కోసింది. 240 మందికి పైగా ఇజ్రాయిలీ ప్రజల్ని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లింది. గతేడాది చివర్లో కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా 100 మంది వరకు బందీలను హమాస్ విడుదల చేసింది. ఒప్పందంలో భాగంగా తమ జైళ్లలో ఉన్న పలువురు పాలస్తీనియన్లను విడుదల చేసింది.
ఇదిలా ఉంటే హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకోవడంలో ఇజ్రాయిల్ ప్రధానిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆగ్రహంతో ఉన్నారు. హమాస్ కాల్చి చంపిన ఆరుగురు బందీల్లో ఒకరు అమెరికన్ ఇజ్రాయిలీ ఉన్నారు. మరోవైపు అమెరికా, ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్న చర్చల్లో గాజా-ఈజిప్ట్ సరిహద్దులోని ఫిలడెల్ఫి కారిడార్ కీలకంగా మారింది. ఇక్కడ నుంచి వైదొలగాలని హమాస్ కోరుతుంటే, ఈ ప్రాంతంపై తమ నియంత్రణ ఉండాలని నెతన్యాహూ పట్టుబడుతున్నారు. యుద్ధ లక్ష్యాల సాధన ఫిలడెల్పీ కారిడార్ గుండా వెళుతోందని నెతన్యాహూ చెప్పారు. తాను ఒత్తిడికి లొంగేది లేదని చెప్పారు. అక్టోబర్ 7 దాడిలో బందీలుగా 251 మందిలో 97 మంది ఇంకా గాజాలోనే ఉన్నారు. వీరిలో 33 మంది మరణించినట్లు ఇజ్రాయిల్ సైన్యం చెబుతోంది.
తాజావార్తలు
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!