Hamas: ఇలాగే దాడులు చేస్తే బందీలు ‘‘శవపేటికల్లో వస్తారు’’.. ఇజ్రాయిల్‌కి హమాస్ వార్నింగ్..
- ఇజ్రాయిల్‌కి హమాస్ వార్నింగ్..
- ఇలాగే దాడులు చేస్తే బందీలు శవపేటికల్లో వస్తారు..
- హెచ్చరికలు జారీ చేసిన హమాస్ మిలిటరీ వింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hamas: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో హమాస్ మిలిటెంట్లు బందీలను చంపడం మొదలుపెట్టారు. ఇటీవల గాజాలోని దక్షిణ ప్రాంతమై రఫాలోని భూగర్భ సొరంగాల్లో ఇజ్రాయిల్ సైన్యం ఆరుగురు బందీల మృతదేహాలను కనుగొంది. వీరిని అతి దగ్గర నుంచి తలలోకి కాల్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఇజ్రాయిల్ వ్యాప్తంగా నిరసనలకు కారణమైంది. బందీలను ప్రధాని బెంజమిన్ నెతన్యాహూని ప్రజలు నిందిస్తున్నారు. హమాస్‌తో బందీలను విడుదల చేసే ఒప్పందం చేసుకోవడంలో ఇజ్రాయిల్ ప్రధాని విఫలమయ్యారని ఆరోపించారు.
ఇజ్రాయిల్ బలగాలు తమ స్థావరాలకు చేరుకుంటే, మేము మా కార్యకర్తలకు కొత్త ఆదేశాలు ఇచ్చామని, వారిని కాల్చి చంపుతామని హెచ్చరించాడు. బందీల మరణాలకు ఇజ్రాయిల్ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. ఒప్పందం కుదుర్చుకోవడానికి బదులు సైనిక ఒత్తిడి ద్వారా బందీలను నెతన్యాహూ విడిపించాలని అనుకుంటున్నాడని, బందీలు శవపేటికల్లో తిరిగి వస్తారని, వారు సజీవంగా ఉండాలనుకుంటున్నారా లేదా అనేది వారి కుటుంబాలు ఎన్నుకోవాలి అని అతను చెప్పాడు. హమాస్ సీనియర్ లీడర్ సమీ అబు జుహ్రీ మాట్లాడుతూ.. నెతన్యాహూ ఆరుగురు బందీలను చంపాడు, అతను మిగిలిన వారిని చంపడానికి నిశ్చయించుకున్నాడు, ఇజ్రాయిల్ ఒప్పందాన్ని ఎంచుకోవాలని చెప్పాడు.
Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Ukraine War: ఉక్రెయిన్‌లో తుస్సుమన్న పాకిస్తానీ మందుగుండు..
Read Also: IC 814: The Kandahar Hijack: నెట్‌ఫ్లిక్స్ “IC 814 హైజాక్” సిరీస్ బ్యాన్ చేయాలని హైకోర్టులో పిల్..
ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్‌ని ఉద్దేశిస్తూ హమాస్ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాగే సైనిక ఒత్తిడి కొనసాగిస్తే బందీలను ‘‘శవపేటికల్లో పంపిస్తాము’’ అని చెప్పారు. హమాస్ సాయుధ విభాగం ఎజెడిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ ప్రతినిధి అబూ ఒబెయిడా ఒక ప్రకటనలో వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్-హమాస్ మధ్య ఒప్పందం కోసం ఖతార్, అమెరికా, ఈజిప్ట్ ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఈ చర్చల్లో కీలకమైన ఫిలడెల్ఫీ కారిడార్ ప్రతిబంధకంగా మారింది. ఈ ప్రాంతం నుంచి సైనికులను ఉపసంహరించుకోవాలని హమాస్ కోరుతుంటే, ఇజ్రాయిల్ మాత్రం అందుకు సిద్ధంగా లేదు. తాను లొంగిపోయేది లేదని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మరోసారి ప్రకటించారు.
అక్టోబర్ 07 దాడి తర్వాత గత ఏడాది కాలం హమాస్‌పై ఇజ్రాయిల్ యుద్ధం చేస్తోంది. ఈ దాడిలో హమాస్ మిలిటెంట్లు 1200 మంది ఇజ్రాయిలీలను ఊచకోత కోశారు. 240 మందిని బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాపై విరుచుకుపడుతోంది. ఈ దాడిలో అమాయకమైన 40 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. అయితే, హమాస్‌ని కూకటివేళ్లలో పెకిలించే వరకు తాము విశ్రమించేది లేదని పలుమార్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. దీంట్లో భాగంగానే హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేతో పాటు దాని మిలిటరీ చీఫ్ మహ్మద్ డెయిఫ్‌ని హతం చేసింది. పలువురు కమాండర్లను తొలగిస్తోంది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!