Greta Thunberg: హక్కుల కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్‌ని ఇజ్రాయిల్ బహిష్కరించింది. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఆమెకు ప్రాతినిథ్యం వహిస్తున్న హక్కుల సంఘం మంగళవారం ప్రకటించాయి. గాజాకు వెళ్లే ఓడను ఇజ్రాయిల్ స్వాధీనం చేసుకున్న ఒక రోజు తర్వాత ఈ పరిణామం జరిగింది. ‘‘గ్రెటా థన్‌బర్గ్ ఫ్రాన్స్‌కు విమానంలో ఇజ్రాయెల్ నుండి బయలుదేరుతోంది" అని ఎక్స్‌లో ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Israel Hamas War: అక్టోబర్ 07, 2023లో ఏ క్షణాల హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై దాడి చేశారో అప్పటి నుంచి ఆ ఉగ్రసంస్థతో పాటు గాజాలోని ప్రజలు జీవితం దుర్భరంగా మారింది. గత ఏడాదిన్నర కాలంగా ఇజ్రాయిల్ హమాస్ అంతం కోసం గాజాపై దాడులు చేస్తూనే ఉంది. హమాస్ అక్టోబర్ 07 నాటి దాడుల్లో 1200 మందిని హతమార్చడంతో పాటు 250 మందిని బందీలుగా గాజా స్ట్రిప్‌లోకి తీసుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం…
Israel-Hamas: ఇజ్రాయెల్ తన దాడులను తీవ్రతరం చేయడంతో గాజా ప్రాంతంలో గురువారం ఒక్క రోజులోనే 80 మంది పౌరులు మృతి చెందారు. వీరిలో చాలా మంది మహిళలు, పిల్లలు ఉన్నారని పాలస్తీనా వైద్య వర్గాలు వెల్లడించాయి. ఖాన్ యూనిస్‌లోని నాసర్ ఆసుపత్రి ప్రకారం, ఆ నగరంపై జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 54 మంది మరణించారు. దాడుల్లో తీవ్రంగా గాయపడిన వారు అనేకమంది ఉన్నారు. అలాగే గాజా నగరం, ఉత్తర గాజా ప్రాంతాల్లో జరిగిన ఇతర వైమానిక…
Pakistan: బంగ్లాదేశ్ దారిలోనే పాకిస్తాన్ నడుస్తోంది. ఇటీవల ఇజ్రాయిల్-గాజా యుద్ధంపై నిరసనగా పాలస్తీనాకు మద్దతుగా బంగ్లాదేశ్‌లోని ప్రధాన నగరాలు, పట్టణాలలోని కేఎఫ్‌సీ అవుట్‌లెట్స్, బాటా షోరూంలపై అక్కడి నిరసనకారులు దాడులు చేశారు. తాజాగా, పాకిస్తాన్‌లో కూడా కేఎఫ్‌సీ టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి. కేఎఫ్‌సీ రెస్టారెంట్లపై 20 వేర్వేరు దాడులు నమోదయ్యాయి. ఒక ఉద్యోగిని కాల్చి చంపారు. ఈ దాడులకు సంబంధించి దాదాపుగా 160 మందిని అరెస్ట్ చేసినట్లు అక్కడి పోలీసులు శనివారం తెలిపారు.
Microsoft: మైక్రోసాఫ్ట్ బాస్‌లపై భారత సంతతికి చెందిన ఒక ఇంజనీర్ ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గాజాలో మారణహోమానికి ఇజ్రాయిల్‌కి సాంకేతిక సహాయం చేశారని వానియా అగర్వాల్ అనే టెక్కీ ప్రశ్నించింది. ఇజ్రాయిల్ సైనిక చర్యలలో మైక్రోసాఫ్ట్ భాగస్వామి అని ఆమె ఆరోపించింది. మైక్రోసాఫ్ట్ బాస్‌లు సత్య నాదెళ్ల, స్టీవ్ బాల్మెర్, బిల్ గేట్స్ ముగ్గురూ ఉన్న సమయంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగి ఆగ్రహంలో వీరంతా ఒకింత…
పాలస్తీనియన్ ఉగ్రవాద సంస్థ హమాస్ సొంత ప్రజల పైనే తన కోపాన్ని చూపిస్తోంది. ఇటీవల గాజా స్ట్రిప్‌లోని ప్రజలు హమాస్‌కి వ్యతిరేకంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ‘‘హమాస్ అవుట్’’ అంటూ నినదించారు. అయితే, ఈ పరిణామాలు హమాస్ ఉగ్ర సంస్థకు నచ్చలేదు. దీంతో సొంత ప్రజలనే ఉరితీసి చంపేస్తోంది. హమాస్ ఇప్పటి వరకు కనీసం ఆరుగురు గాజా ప్రజల్ని ఉరితీసినట్లు తెలుస్తోంది. కొందరిని కిడ్నాప్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నివేదికల ప్రకారం, చాలా మందికి బహిరంగంగా…
Gaza: ఇన్నాళ్లు యుద్ధంలో సర్వం కోల్పోయిన గాజా ప్రజలు తీవ్ర ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తమ పరిస్థితికి ‘‘హమాస్’’ ఉగ్రవాదులే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు గాజా ప్రజల కోసం ప్రజల కోసమే తాము పోరాడుతున్నామని చెప్పుకుంటున్న హమాస్‌కి అక్కడి ప్రజల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బుధవారం వరసగా రెండో రోజు, గాజా స్ట్రిప్‌లోని వందలాది మంది పాలస్తీనియన్లు వీధుల్లోకి వచ్చి హమాస్‌కి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. Read Also: Disha Salian Case:…
Gaza: పాలస్తీనియన్లను గాజా నుంచి తరిమేసేందుకు ఇజ్రాయిల్, అమెరికా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆఫ్రికా దేశాలను సంప్రదిస్తున్నట్లు సమాచారం. మూడు ఆఫ్రికా దేశాల్లో వీరికి పునరావాసం కల్పించడానికి చర్చిస్తున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ యూఎస్, ఇజ్రాయిల్ అధికారుల్ని ఉటంకిస్తూ నివేదించింది. ఈ ప్రతిపాదనకు సంబంధించి సుడాన్, సోమాలియా, సోమాలిలాండ్‌తో ఈ ప్రతిపాదన గురించి చర్చిస్తున్నారు.
S. Jaishankar: పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ మాట్లాడుతూ.. గాజా సమస్యకు ‘ద్విదేశ’ పరిష్కారానికి తాము మద్దతు ఇస్తామని తెలిపారు.