Greta Thunberg: హక్కుల కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్‌ని ఇజ్రాయిల్ బహిష్కరించింది. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఆమెకు ప్రాతినిథ్యం వహిస్తున్న హక్కుల సంఘం మంగళవారం ప్రకటించాయి. గాజాకు వెళ్లే ఓడను ఇజ్రాయిల్ స్వాధీనం చేసుకున్న ఒక రోజు తర్వాత ఈ పరిణామం జరిగింది. ‘‘గ్రెటా థన్‌బర్గ్ ఫ్రాన్స్‌కు విమానంలో ఇజ్రాయెల్ నుండి బయలుదేరుతోంది” అని ఎక్స్‌లో ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Read Also: S Jaishankar: పాకిస్తాన్‌లో ఎక్కడ ఉన్నా తీవ్రవాదుల్ని వదిలిపెట్టం..
థన్‌బర్గ్, మరో ఇద్దరు కార్యకర్తలు, ఒక జర్నలిస్ట్ డిపోర్ట్‌కి గురయ్యారని, ఇజ్రాయిల్‌ని వదిలేందుకు అంగీకరించారని ఇజ్రాయిల్‌లోని చట్టపరమైన హక్కుల సంఘం అదాలా తెలిపింది. ఇతర యాక్టివిస్ట్‌లు బహిష్కరణకు నిరాకరించారని, వారు నిర్భందంలో ఉన్నారు, ఇజ్రాయిల్ అధికారులు వీరిని విచారించనున్నారు.
యుద్ధంలో దెబ్బతిన్న గాజాలోని ప్రజలకు సహాయం తీసుకెళ్లేందుకు వెళ్తున్న షిప్‌ని ఇజ్రాయిల్ సీజ్ చేసింది. మాడ్లీస్ అనే ఓడలో థన్‌బర్గ్‌తో సహా 12 మంది ఉన్నారు. ఇజ్రాయిల్ నేవీ సోమవారం తెల్లవారుజామున గాజా తీరానికి 200 కి.మీ దూరంలో ఈ ఓడను స్వాధీనం చేసుకుంది. గాజాలో కొనసాగుతున్న యుద్ధం, మానవతా సంక్షోభాన్ని ఈ హక్కుల కార్యకర్తలు నిరసించారు. అయితే, గాజాపై తమ నేవీ ఆంక్షలను ఉల్లంఘించినట్లు ఇజ్రాయిల్ చెబుతోంది. అయితే, ఇజ్రాయిల్ థన్‌బర్గ్ వ్యవహారాన్ని పబ్లిసిటీ స్టంట్‌గా విమర్శించింది.
Greta Thunberg just departed Israel on a flight to Sweden (via France). pic.twitter.com/kWrI9KVoqX
— Israel Foreign Ministry (@IsraelMFA) June 10, 2025