కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను రూ.200 తగ్గించడంపై రాజకీయాలు మొదలయ్యాయి. అధికార పార్టీ.. రక్షా బంధన్‌కు ముందు దేశంలోని సోదరీమణులకు ప్రధాని మోడీ ఇచ్చిన బహుమతి అని అటుండగా.. మరోవైపు కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష కూటమి ఎన్నికల బహుమతిగా విమర్శలు చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. ఇది ఎన్నికల లాలీపాప్‌గా అభివర్ణించారు.
LPG Cylinder Rates: 2023-2024 ఆర్థిక సంవత్సరం మొదటి రోజు గ్యాస్ ధరలపై గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించింది. ఏప్రిల్ 1వ తేదీన వంట గ్యాస్ ధరలు దాదాపు రూ.92 తగ్గించింది.. అయితే, రేట్ల తగ్గింపు కేవలం వాణిజ్య గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మాత్రమే. దేశీయ ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారుల మాత్రం ఎలాంటి ఉపశమనం లేదు.. కాగా, 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ల ధరలు గత నెలలోనే పెంచింది ప్రభుత్వం..…
అమ్మో ఒకటో తారీఖు.. ఇది సినిమా పేరు కాదండి. నిజంగానే ఒకటో తారీఖు వచ్చిందంటే సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. అలా శాలరీ క్రెడిట్ కాగానే ఇలా డబ్బులన్నీ అయిపోతాయి. ఉద్యోగులకే కాదు సామాన్యులందరికీ ఒకటో తారీఖు అంటే ఓ రకమైన ఫీలింగ్. అయితే అక్టోబర్ 1వ తేదీ సామాన్యుల జీవితాల్లో మరింత పెనుభారం కాబోతోంది. ఎందుకంటే అక్టోబర్ 1 నుంచి పలు నిబంధనలు మారనున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సిస్టమ్‌లో నిబంధనలు, ఎల్‌పీజీ గ్యాస్ రేట్లు వంటి…
పెట్రోలు, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. దీంతో, సామాన్యుడికి ఊరట లభించినట్టు అయ్యింది.. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయంపై ప్రశంసలు కురిపించిన బండి సంజయ్.. తెలంగాణలోనూ కేసీఆర్ పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారితో భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీనికితోడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంవల్ల నిత్యావసర వస్తువుల దిగుమతులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. అయినప్పటికీ దేశ…
నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బ్యాంకు నిబంధనలు, రైల్వేలు, గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు వంటివి ఇందులో ఉన్నాయి. ఆయిల్ సంస్థలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను సోమవారం నాడు సవరించనున్నాయి. ఇప్పటికే పలుమార్లు పెరిగిన గ్యాస్ ధర.. రేపు మరోసారి పెరిగే అవకాశం ఉంది. అటు, పెన్షనర్లు లైవ్ సర్టిఫికేట్ సమర్పణకు బ్యాంకుకు రావాల్సిన అవసరం లేకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కల్పించిన వీడియో కాల్ సదుపాయం రేపటి…