నవంబర్ 1 నుంచి ఏం మారనున్నాయి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బ్యాంకు నిబంధనలు, రైల్వేలు, గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు వంటివి ఇందులో ఉన్నాయి. ఆయిల్ సంస్థలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను సోమవారం నాడు సవరించనున్నాయి. ఇప్పటికే పలుమార్లు పెరిగిన గ్యాస్ ధర.. రేపు మరోసారి పెరిగే అవకాశం ఉంది. అటు, పెన్షనర్లు లైవ్ సర్టిఫికేట్ సమర్పణకు బ్యాంకుకు రావాల్సిన అవసరం లేకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కల్పించిన వీడియో కాల్ సదుపాయం రేపటి నుంచి అమల్లోకి రానుంది.
మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయడానికి , విత్‌డ్రా చేయడానికి కొత్త ఛార్జీలను ప్రవేశపెట్టబోతోంది. వాస్తవానికి, నిర్ణీత పరిమితి పరిమితి కంటే ఎక్కువ బ్యాంకింగ్ సేవను ఉపయోగించినందుకు మీరు రుసుము చెల్లించాలి. ఉదాహరణకు రుణ ఖాతాకు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. ఖాతాదారుడు నాలుగోసారి డబ్బులు డిపాజిట్ చేస్తే రూ.40 చార్జీ విధిస్తారు. మీ జన్ ధన్ ఈ బ్యాంకులో ఉంటే, డబ్బు డిపాజిట్ చేయడానికి ఎటువంటి ఛార్జీ ఉండదు. కానీ ఉపసంహరణపై రూ.100 చెల్లించాలి.
Also Read
Also Read: స్టాక్ మార్కెట్లో ఐపీఓల సందడి
అటు భారతీయ రైల్వేలు దేశంలోని రైళ్ల టైమ్ టేబుల్‌ని మార్చబోతున్నాయి. కొత్త టైమ్ టేబుల్ అక్టోబర్ 1 నుంచి అమలు కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 31 వరకు పొడిగించారు. ఇప్పుడు 13 వేల ప్యాసింజర్ రైళ్లు, 7 వేల గూడ్స్ రైళ్ల వేళలు మారబోతున్నాయి. నవంబర్ మొదటి తేదీ నుంచి దాదాపు 30 రాజధాని రైళ్ల వేళలు కూడా మారనున్నాయి. అంతేకాకుండా రేపటి నుంచి ఆండ్రాయిడ్, ఐవోఎస్ పాత వెర్షన్‌లలో వాట్సాప్ యాప్ పనిచేయదు. ఇవే కాకుండా పాలసీబజార్ సంస్థ కూడా సోమవారమే ఐపీవోకు రానుంది. దీంతోపాటు నవంబర్‌లో పలు సంస్థలు ఐపీవోకు రానున్నాయి.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!