సామాన్యులకు మరో బ్యాడ్ న్యూస్. దేశీయ చమురు సంస్థలు వినియోగదారులకు మరో షాకిచ్చాయి. సామాన్యుడిపై గ్యాస్ సిలిండర్ ధర పెరుగుదల రూపంలో మరో భారం పడింది. గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. 14.2 కేజీల సిలిండర్ ధరను రూ.50 మేర పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో.. గ్యాస్ బండ రేటు 1100 దాటేసింది. ఈ నిర్ణయంతో ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న సామాన్యులపై మరింత భారం పడనుంది.
Live: శ్రీవారి హుండీ ఆదాయం సరికొత్త రికార్డ్
దీంతో హైదరాబాద్‌లో గ్యాస్ బండ ధర ₹1055 నుంచి ₹1105కు చేరింది. దిల్లీలో ప్రస్తుతం రూ.1003గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర తాజా పెంపుతో రూ.1053కు చేరుకుంది. సాధారణంగా ప్రతి నెల 1న వీటి ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ నెల 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను చమురు సంస్థలు ₹183.50 మేర తగ్గించాయి. తాజాగా గృహావసరాల గ్యాస్ ధర మాత్రం పెంచడం గమనార్హం. పెంచిన గ్యాస్ సిలిండర్ ధర నేటి నుంచే అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ నెల 1న 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.183.50 మేర తగ్గించాయి. తాజాగా నెలలో 5 రోజులు గడిచిన తర్వాత గృహావసరాల గ్యాస్ సిలిండర్ ధరను పెంచడం చర్చనీయాంశంగా మారింది.