LPG Cylinder Rates: గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర.. కొత్త ధరలు ఇలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Cylinder Rates: 2023-2024 ఆర్థిక సంవత్సరం మొదటి రోజు గ్యాస్ ధరలపై గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించింది. ఏప్రిల్ 1వ తేదీన వంట గ్యాస్ ధరలు దాదాపు రూ.92 తగ్గించింది.. అయితే, రేట్ల తగ్గింపు కేవలం వాణిజ్య గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మాత్రమే. దేశీయ ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారుల మాత్రం ఎలాంటి ఉపశమనం లేదు.. కాగా, 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ల ధరలు గత నెలలోనే పెంచింది ప్రభుత్వం.. గత నెలలో, కేంద్రం దేశీయ వంట గ్యాస్ ధరలను రూ.50 పెంచిన విషయం విదితమే. ముఖ్యంగా, మార్చిలో ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను రూ.350 పెంచింది.. ఇప్పుడు రూ.92 తగ్గించింది.
Read Also: Covid-19: ఈ కొత్త వేరియంట్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి.. మాస్క్ తప్పనిసరి
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
తాజాగా సవరించిన రేట్ల తర్వాత ఇండేన్ గ్యాస్ సిలిండర్ ధరలు (19 కిలోల సిలిండర్): ఢిల్లీలో రూ.2028గా, కోల్‌కతాలో రూ.2132గా, ముంబైలో రూ.1980గా.. చెన్నైలో రూ.2192.50గా ఉంది.. ఇక, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను ఓసారి పరిశీలిస్తే.. శ్రీనగర్‌లో రూ.1,219, ఢిల్లీలో రూ.1,103, పాట్నాలో రూ.1,202, లేహ్‌లో రూ.1,340, ఐజ్వాల్‌లో రూ.1255, అండమాన్‌లో రూ.1179, అహ్మదాబాద్‌లో రూ.1110, భోపాల్‌లో రూ.1118.5, జైపూర్‌లో రూ. 1116.5, బెంగళూరులో రూ. 1115.5, ముంబైలో రూ. 1112.5, కన్యాకుమారిలో రూ.1187, రాంచీలో రూ.1160.5, సిమ్లాలో రూ.1147.5, దిబ్రూగర్‌లో రూ.1145, లక్నోలో రూ.1140.5. ఉదయపూర్‌లో రూ.1132.5, ఇండోర్‌లో రూ.1131, కోల్‌కతాలో రూ.1129, డెహ్రాడూన్‌లో రూ.1122, విశాఖపట్నంలో రూ.1111, చెన్నైలో రూ. 1118.5, ఆగ్రాలో రూ. 1115.5, చండీగఢ్‌లో రూ. 1112.5గా ఉన్నాయి..
Read Also: Govinda Namalu: ఈ రోజు గోవింద నామాలు వింటే కోరికలన్నీ నెరవేరుతాయి..
దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ల మాదిరిగా కాకుండా, వాణిజ్య గ్యాస్ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటాయి. 1 ఏప్రిల్ 2022న, ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2,253కి అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆ ధర రూ. 2,028 రూపాయలకు తగ్గించబడ్డాయి. గత ఏడాది కాలంలో ఢిల్లీలో మాత్రమే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు రూ.225 తగ్గాయి. ప్రత్యేకంగా, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం గృహ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని ప్రకటించింది. గత నెలలో, సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, ఉజ్వల యోజన యొక్క 9.59 కోట్ల మంది లబ్ధిదారులు సంవత్సరానికి ప్రతి 14.2 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.200 సబ్సిడీని పొందుతారు. కేంద్రం ఏడాదికి 12 సార్లు రీఫిల్ పరిమితిని విధించిందని ప్రకటించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!