మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో రెండోరోజు ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. అక్రమ మైనింగ్, మనీలాండరింగ్ కేసులో తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రికి సంబంధించిన ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టారు. దీంతో.. దుబాయ్ లో కుటుంబంతో ఉన్న గంగుల కమలాకర్ నిన్న అర్థరాత్రి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు.
2022-23 వానాకాలం ధాన్యం సేకరణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి గంగుల కమలాకర్.. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో తెలంగాణలో పంటలు బాగా పండాయన్నారు.. 24 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 1 కోటి 41 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందని.. తెలంగాణ రైతు పండించిన ప్రతీ గింజా కొంటామని స్పష్టం చేశారు.. ఈ సీజన్‌లో 112 లక్షల మెట్రిక్ ధాన్యం కొనుగోలు అంచనా వేశామని.. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, మాయిశ్చర్ మిషన్లు, ప్యాడీ క్లీనర్లు…
Minister Chelluboina: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌పై ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలపై సజ్జల స్పందించారని.. రాజకీయాలు ఒక వికృత క్రీడగా మారిపోయాయని.. ఎవరి ఇష్టానుసారం వారు మాట్లాడటం అలవాటు అయిపోయిందని మండిపడ్డారు. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. మాతో పెట్టుకుంటే ఏదైనా చేస్తాం అన్న వ్యాఖ్యలను తక్షణమే గంగుల కమలాకర్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.…